టాలీవుడ్ ఇండస్ట్రీ లోని సినిమాలకు సంగీతం ఒక ఊపిరిగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే మరో నాలుగు రోజుల్లో ఈ ఏడాది పూర్తి కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది సంగీత ప్రియులను అలరించిన తెలుగు సినిమా పాటలు ఎన్నో వచ్చాయి. కొన్ని సాంగ్స్ అయితే సినిమా విడుదల అవ్వకముందే, ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటే మరికొన్ని పాటలు సినిమా విడుదలైన తర్వాత జనాలలోకి బాగా వెళ్లిపోయాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో వైరల్ అయిన పాటలు కొన్ని ఉంటే, నెట్టింట దుమ్మురేపిన డాన్స్ వీడియోలు కూడా ఇంకొన్ని ఉన్నాయి. మరి మొత్తానికి ఈ ఏడాది ప్రేక్షకులను మెప్పించిన బెస్ట్ సాంగ్స్ లో టిల్లు స్క్వేర్ మూవీ లోని రాధికా, రాధికా సాంగ్ ఒకటి.స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ 2024 మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తేలిసిందే.కల్ట్ ఫేవరేట్ డీజే టిల్లు కు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.ఇక ఈ సినిమా పాటలు, ట్రైలర్స్ అభిమానుల్లో అంచాలను రేకెత్తించాయి.ముఖ్యంగా సిద్ధు జొన్నలగడ్డ రాధికా పాటకి మరింత ఉత్సాహం తీసుకొచ్చారు.ఈ పాటలో సిద్దు పక్కన తన అందం తో, కొంటె చూపులతో అనుపమ పరమేశ్వరన్ ఎంతగానో మెప్పించింది.

రాధిక పాట ఆకర్షణీయమైన బీట్‌ను కలిగి ఉంటుంది.రామ్ మిరియాల తన విలక్షణ శైలిలో పాటను స్వరపరచడమే కాకుండా తానే స్వయంగా ఆలపించారు. ఈ గీతానికి కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. రామ్ మిరియాల సంగీతం, గాత్రం, కాసర్ల శ్యామ్ సాహిత్యం కలిసి ఈ పాట అద్భుతంగా ప్రేక్షకులను అక్కట్టుకుంది.డీజే టిల్లు తో రాధిక పేరు ఒక బ్రాండ్ లా మారిపోయింది. అంతగా జనాదరణ పొందిన రాధిక పేరుతో వచ్చిన ఈ పాట విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒకసారి వినగానే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే అంతగా ఈ పాట బాగుంది. ఈ పాట ఖచ్చితంగా ఈ సంవత్సరంలోని టాప్ 10 చార్ట్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది అనడంలో సందేహం లేదు.ఇక ఈ పాటకి భాను మాస్టర్ కోరియోగ్రాఫ్ చేసారు.డీజే టిల్లు టైటిల్ సాంగ్ ను కూడా భాను మాస్టరే కోరి్యోగ్రాఫ్ చేసారు.ఇంకా గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి కి వర్క్ చేశారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లో స్పెషల్ సాంగ్ మోత మోగిపోద్ది చేశారు. ఆయన సీతా కళ్యాణ వైభోగమే సినిమాలో ఓ పాటకు కూడా కొరియోగ్రఫీ చేశారు.ఇక రాధికా పాట థియేటర్లతో పాటుగా సోషల్ మీడియాని కూడా షేక్ చేసింది. పార్టీలలో, పెళ్లిళ్లలో, కాలేజ్ ఈవెంట్స్ లో, ఉరేగింపులలో ఎక్కడ చూసిన ఈ పాటే వినిపించింది. ఈ క్రమంలో లోనే ఈ పాట యూత్ కి బాగా ఎక్కేసింది. ఎక్కడ డీజే ప్లే చేసిన రాధికా పాట ఉండాల్సిందే అనే రేంజ్ లో ట్రెండ్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: