టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. చిరంజీవి తన కెరియర్లో ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేశాడు. అలా రిజెక్ట్ చేసిన సినిమాలలో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరి చిరంజీవి వదిలేసిన బ్లాక్ బస్టర్ సినిమాలు ఏవి ..? అవి ఎందుకు వదిలేశాడు. వాటిలో ఎవరు హీరోలుగా నటించారు అనేది వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం అర్జున్ హీరో గా కోడి రామకృష్ణ దర్శకత్వంలో మన్యంలో మొనగాడు అనే సినిమా వచ్చింది. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారా అర్జున్ కి మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే కోటి రామకృష్ణ మొదట ఈ సినిమాను చిరంజీవి తో చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా కథను కూడా వివరించాడట. కథ మొత్తం విన్న చిరంజీవి కి కథ సూపర్ గా ఉంది. కానీ నాపై ఈ సినిమా వర్కౌట్ కాదు అని చెప్పాడట. దానితో కోడి రామకృష్ణ , అర్జున్ తో ఈ సినిమాను రూపొందించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. మోహన్ బాబు హీరో గా రూపొందిన అసెంబ్లీ రౌడీ సినిమాను మొదట చిరంజీవి తో చేయాలి అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను చేయలేను అని చిరంజీవి చెప్పడంతో మోహన్ బాబు తో ఈ మూవీ ని రూపొందించారట.

మూవీ కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇలా చిరంజీవి తన కెరీర్ లో ఈ రెండు బ్లాక్ బస్టర్ మూవీలను మిస్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి , మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అలాగే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా ఓ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: