యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి, ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా స్టార్ గా సినిమాలు చేస్తున్నాడు తారక్. ఆర్ఆర్ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్. ఇక ఎన్టీఆర్ కెరీర్ లో మొదటి భారీ హిట్, ఎక్కువ కలెక్షన్స్ వచ్చిన సినిమా సింహాద్రి. రాజమౌళి,ఎన్టీఆర్ కాంబోలో ఎన్టీఆర్ 7వ సినిమాగా వచ్చిన సింహాద్రి భారీ విజయం సాధించింది. 8 కోట్లతో ఈ సినిమాని తెరకెక్కిస్తే ఏకంగా 25 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇది రాజమౌళి,ఎన్టీఆర్ కాంబోలో రెండో సినిమా. ఈ సినిమా విజయంతో ఎన్టీఆర్ స్టార్ హీరోగా మారిపోయారు.ఇదిలావుండగా 20 ఏళ్లు కూడా నిండని అతడికి ఏకంగా ఇండస్ట్రీ హిట్ ఇచ్చి తిరుగులేని మాస్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టిందీ చిత్రం. రాజమౌళిని స్టార్ డైరెక్టర్‌ ను చేసింది.. విజయేంద్ర ప్రసాద్‌ను రచయితగా నిలదొక్కుకునేలా చేసింది కూడా ఈ సినిమానే. ఇలా అనేక మలుపులకు కారణం అయిన ఈ సినిమాలో నిజానికి ఎన్టీఆర్ బాబాయి నందమూరి బాలకృష్ణ హీరోగా నటించాల్సిందట.

కానీ ఆయన ఈ కథ వద్దనుకున్నాడట. ఇందుకు కారణమేంటో రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన యూట్యూబ్ ఛానెల్ ‘పరుచూరి పలుకులు’లో ఒక ఎపిసోడ్లో భాగంగా వెల్లడించారు. ‘సాహో’ సినిమాలో లోపాల గురించి చెబుతూ ఆయన ‘సింహాద్రి’ ప్రస్తావన తెచ్చారు.తెలుగులో నేరము-శిక్ష కథలు ఎన్నో విజయవంతం అయ్యాయని బాలయ్య కూడా ఈ కోవలో సమరసింహారెడ్డి, వంశానికొక్కడు,రౌడీ ఇన్‌స్పెక్టర్’ లాంటి సినిమాలు చేసి హిట్లు కొట్టాడని పరుచూరి చెప్పారు. ఐతే తర్వాత బాలయ్య దగ్గరికి ‘సింహాద్రి’ కథ కూడా వచ్చిందని ఐతే ఇప్పటికే ఈ తరహా కథలతో మూడు సినిమాలు చేశాను కాబట్టి మళ్లీ అలాంటిదే వద్దు అని బాలయ్య తిరస్కరించాడని ఆయన వెల్లడించారు. బాలయ్యకు విజయేంద్ర ప్రసాద్ ఈ కథ చెప్పారని.. ఆయన ఓకే అంటే దానికి తామే మాటలు కూడా రాయాల్సిందని,అది వద్దనుకున్న బాలయ్య పలనాటి బ్రహ్మనాయుడు కథ నచ్చి ఆ సినిమా ఎంచుకున్నాడు పాపం అంటూ సానుభూతి వ్యక్తం చేశారు పరుచూరి బాలకృష్ణ మరి అబ్బాయ్ బదులు బాబాయ్ ఈ సినిమా చేసి ఉంటే వాళ్లిద్దరి కెరీర్లు ఎలా ఉండేవో.సింహాద్రి కథను బాలయ్య చేస్తే దాని ఎలివేషన్ ఇంకెలా ఉండేదో.

మరింత సమాచారం తెలుసుకోండి: