అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా తర్వాత అట్లీ కాంబోలో సినిమా తెరకెక్కబోతుంది అంటూ ప్రచారం జరిగింది . అయితే అట్లీ నిజంగానే బన్నీకి స్టోరీ వివరించారట . బన్నీ ఆ ప్రాజెక్టు రిజెక్ట్ చేశాడట . దానికి కారణం ఆ స్టోరీలో కొన్ని సీన్స్ అదేవిధంగా కొన్ని లాజిక్స్ మిస్ అవ్వడమే. అల్లు అర్జున్ - బన్నీల ప్రాజెక్టు కన్ఫామ్ అవ్వబోతుందని చెప్పడానికి మెయిన్ రీజన్ అట్లీ భార్యప్రియ ఓసారి షేర్ చేసిన ఫోటోనే . అయితే షారుక్ ఖాన్ కి జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఆనందంలో అట్లీ ఆ టైంలో మంచి దూకుడుగా ప్రవర్తించాడు .
అయితే ఆ తర్వాత అల్లు అర్జున్ సినిమా ఓకే అయినట్లే అయి క్యాన్సిల్ అయిపోవడంతో ఆయన కెరీర్ డౌన్ ఫాల్ అయిపోయింది. అయితే అల్లు అర్జున్ తీసుకున్న డెసీషన్ నే కరెక్ట్ అంటూ ప్రూవ్ అయింది .ఎందుకంటే రీసెంట్ గా బాలీవుడ్ లో భారీ అంచనాల నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన బేబీ జాన్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. బాలీవుడ్ ఆల్ టైం ఫ్లాప్స్ లో ఒకటిగా నిలిచిపోయేందుకు పరుగులు తీస్తుంది. ఈ మూవీకి దర్శకుడు కలీస్ అయినప్పటికీ కర్త - కర్మ - క్రియ మొత్తం కూడా నిర్మాతగా వ్యవహరించిన అట్లీనే చూసుకున్నాడు అన్న టాక్ వినిపించింది . ఎందుకంటే "తేరి" రీమిక్స్ కదా . వరుణ్ ధావన్ ని సూపర్ స్టార్ గా మార్చబోతున్నాం అంటూ పెద్ద స్టేట్మెంట్ కూడా అట్లీ పాస్ చేసేసాడు. సీన్ కట్ చేస్తే బేబీ జాన్ దారుణతి దారుణంగా నిరాశపరిచింది. ఇదేమూమెంట్ లో బన్నీ ఫాన్స్ అల్లు అర్జున్ తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అయింది అని ..అల్లు అర్జున్ స్టోరీ విషయంలో చాలా చాలా పక్కాగా ఉంటాడు అని అల్లు అర్జున్ టాలెంటెడ్ అని పొగిడేస్తున్నారు..!