టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి స్నేహితులుగా రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లకు గుర్తింపు ఉంది. చరణ్, తారక్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలై దాదాపుగా మూడు సంవత్సరాలు అవుతున్నా ఈ సినిమాకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదనే సంగతి తెలిసిందే. మరోవైపు ఆర్ఆర్ఆర్ మేకర్స్ రూపొందించిన డాక్యుమెంటరీ ఆర్.ఆర్.ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ తాజాగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
 
ఆర్.ఆర్.ఆర్ సినిమలో రామ్ చరణ్ ఎన్టీఆర్ ను కొరడాతో కొట్టే సీన్ సినిమాకు హైలెట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. చరణ్ ఎన్టీఆర్ ను కొట్టిన వెంటనే చరణ్ తారక్ ను హగ్ చేసుకోవడం గమనార్హం. చరణ్ తారక్ మధ్య స్నేహాన్ని చూస్తే ముచ్చటేస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. చరణ్, తారక్ ప్రస్తుతం వేర్వేరు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.
 
చరణ్, తారక్ క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. గేమ్ ఛేంజర్ సినిమాలో ఆసక్తికర ట్విస్టులు ఉంటాయని ఫస్టాఫ్ అబవ్ యావరేజ్ అనేలా ఉన్నా సెకండాఫ్ మాత్రం అద్భుతంగా ఉంటుందని సమాచారం అందుతోంది. గేమ్ ఛేంజర్ సినిమా 500 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం.
 
గేమ్ ఛేంజర్ సినిమా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది. గేమ్ ఛేంజర్ సినిమా తమిళనాడులో సైతం రికార్డ్ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుందని తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో దిల్ రాజు చాలా ఆశలు పెట్టుకున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాలో ఎన్నో ట్విస్టులు ఉండనున్నాయని సమాచారం అందుతోంది. చరణ్ శంకర్ కాంబో మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమా ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: