అయితే తాజాగా ఆర్నాగ్ గోసామి తాజాగా వెల్లడించినటువంటి మొన్న పోలీసుల స్టేట్మెంట్, మొన్నమధ్య సోషల్ మీడియాలో కూడా వచ్చిన విషయాలు ఒకదానికొకటి పొంతనగా ఉన్నాయి.. తప్పుడు ప్రచారాలు చేస్తే కచ్చితంగా కేసులు పెడతామంటూ పోలీసులు హెచ్చరించారు. ఎవరి దగ్గరైనా ఆధారాలు ఉంటే తీసుకువచ్చి బయట పెట్టండి అంటూ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. అసలు పోలీసులు వార్నింగ్ ఇవ్వడానికి కారణం ఏంటి అంటే.. ఒక వీడియో వైరల్ గా మారింది.. అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వెళ్ళింది 9:40 కి.. అక్కడ ఉన్న సీసీ కెమెరాలు 9:20 తొక్కిసలాట జరిగిందనే విధంగా వార్తలు వినిపించాయి. అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగిందని రేవతి చనిపోవడం సంభవించిందనే విధంగా ఒక వీడియో వైరల్ గా మారింది. అల్లు అర్జున్ వచ్చాక జరగలేదు అన్నటువంటి పాయింట్ని ఒక సోషల్ మీడియా యూజర్ పోస్ట్ చేయడం జరిగింది.
అల్లు అర్జున్ కొన్నటువంటి ఒక స్థలం వల్ల ఈ గొడవ కు కారణం అయ్యిందనే విధంగా వార్తలు వినిపించాయి. ఆర్నాగ్ గోస్వామి రైజ్ చేసినటువంటి పాయింట్లో అల్లు అర్జున్ సెక్యూరిటీ బౌన్సర్లు ముందే వెళ్లిపోయారని.. థియేటర్ వద్ద ఒకే దారి ఉంది రావడానికి వెళ్లడానికి.. అక్కడ తొక్కిసలాట సందర్భంగా లాఠీ చార్జ్ బౌన్సర్లే చేశారనే విధంగా తెలియజేస్తూ వాళ్లకి హక్కు లేదు కానీ అలాంటిది ఎలా చేశారని విషయాన్ని రైజ్ చేశారు.. అప్పుడే రేవతి చనిపోవడం సంభవించిందనే విధంగా.. అప్పుడే ఆమెను బయటకి తీసుకు వెళుతున్న విజువల్స్ కూడా ఉన్నది.. ఆ తర్వాత ఒక 15 నిమిషాలకు అల్లు అర్జున్ వచ్చారని.. అని ఆర్నాగ్ గోసాన్ని తెలియజేస్తున్నారు.
పోలీసులు చెబుతున్న ప్రకారం అల్లు అర్జున్ 9:40 కి వచ్చారు కానీ ఈ సంఘటన 9: 20 కే జరిగిందట. మరి ఇప్పుడు పోలీసులు ఈ విషయం పైన నిజం చెప్పాలి అంటూ పలువురు నెటిజెన్స్ కామెంట్స్.. ముందు చనిపోయాక అల్లు అర్జున్ వచ్చారా..! అల్లు అర్జున్ వచ్చినప్పుడు తొక్కిసలాట జరిగినప్పుడు రేవతి చనిపోయిందా ఏది నిజం..? అల్లు అర్జున్ రాకముందు జరిగితే బౌన్సర్లు థియేటర్ యాజమాన్యం బాధ్యత వహించాలి.. ఒకవేళ అల్లు అర్జున్ వచ్చిన తర్వాత జరిగితే .. నీవల్ల తొక్కిసలాట జరిగింది థియేటర్లో నుంచి బయటికి రావాలి అని చెప్పిన బయటికి వెళ్లలేదు.. లోపల నుంచి బయటికి బలవంతంగా తీసుకువచ్చామంటూ పోలీసులు తెలిపారు. మరి ఇందులో ఎవరు నిజం చెబుతారనేది చూడాలి.