రీసెంట్గా పుష్ప2 సినిమాలో "కిస్సిక్" అనే ఐటెం సాంగ్ కూడా చేసింది . ఈ పాట ఆమె పేరుని మారు మ్రోగిపోయేలా చేస్తుంది అని అనుకుంది . ఆఫ్ కోర్స్ పాట అయితే హిట్ అయింది కాని శ్రీలీలకు ఏ క్రెడిట్ రాకుండా పోయింది . అయితే ఇప్పుడు శ్రీలీల గురించి ఒక వార్త సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ శ్రీలీల ఓ మంచి ఆఫర్ ని మిస్ చేసుకున్నింది అంటూ జనాలు మండిపడుతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో నవీన్ పోలిశెట్టికి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం గురించి మనకు తెలిసిందే. ఆయన "అనగనగా ఒక రాజు" అనే సినిమాలో నటిస్తున్నాడు .
ఈ సినిమాకి "మ్యాడ్" మూవీ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాత నాగ వంశీ ఈ సినిమాని నిర్మిస్తూ ఉండడం గమనార్హం. ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ ఇటీవల రిలీజ్ అయింది . చాలా చాలా ఆహ్లాదకరంగా అందరినీ ఆకట్టుకుంది . మరొకసారి తన కామెడీతో జనాలను కడుపుబ్బ నవ్వేలా చేయబోతున్నాడు నవీన్ పోలిశెట్టి అంటూ క్లారిటీకి వచ్చేసింది . అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తుంది . నిజానికి ఈ సినిమాలో హీరోయిన్గా అందాల ముద్దుగుమ్మ బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీ లీలా అని అనుకున్నారట. స్టోరీ విని శ్రీలీల కూడా ఓకే చెప్పిందట . అయితే ఆఖరి నిమిషంలో డేట్లు సర్దుబాటు చేయలేక సినిమా నుంచి తప్పుకున్నిందట. ఏదో ఒక విధంగా డేట్లు సర్దుబాటు చేసి ఆమె ఈ సినిమాలో నటించి ఉంటే మాత్రం కామెడీ పరంగా కచ్చితంగా హిట్ కొట్టిండేది. తద్వారా ఆమె నెగిటివిటీ కొంచమైన పాజిటివిటీగా మారుండేది . అయితే అలా చేయలేక ఆమె జనాలు చేత హ్యూజ్ ట్రోల్లింగ్ కి గురవుతుంది..!