ఎన్టీఆర్ నటనపరంగా అన్ని హవ భావాలు పలికించ గొప్ప నటుడు .. ప్రస్తుత తరంలో నవరసాలు పలికించే నటులు చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రస్తుతం అగ్ర హీరోలుగా ఉన్నవారు ఏదో ఒక ఇమేజ్కే పరిమితం అవుతున్నారు .. అందుకే ప్రస్తుతం ఉన్న అగ్ర దర్శకులు , స్టార్ హీరోల వరకు అందరూ ఎన్టీఆర్‌ను తెగ ఇష్టపడుతున్నారు .. అలాంటిది ఎన్టీఆర్‌కు ప్రస్తుత తరంలో ఇష్టమైన హీరో ఒకరు ఉన్నారట .. ఇంతకీ అతను మరెవరో కాదు .. నాచురల్ స్టార్ నాని .. హీరో నాని అన్నా.. అతని నటన అన్న ఎన్టీఆర్‌కు ఎంతో ఇష్టం .. ఇక రానా తో జరిగిన ఇంటర్వ్యూలో పాల్గొన్నా ఎన్టీఆర్‌కు ప్రజెంట్ ఉన్న స్టార్ హీరోల్లో మీకు ఇష్టమైన హీరో ఎవరు అనే ప్రశ్న ఎదురయింది ..
ముందుగా దానికి ఆన్సర్ చెప్పడానికి కొంత తడబడ్డాడు కానీ .. తర్వాత నాని అని చెప్పాడు .. అంతేకాకుండా నానికి ఎన్టీఆర్ భార్య ప్రణతి కూడా పెద్ద ఫ్యాన్ అట .. అలాగే నాని నటించిన పిల్ల జమిందార్ సినిమాను ఎన్నిసార్లు చూసిందో లెక్కేలేదని ఎన్టీఆర్ చెప్పాడు. ఇక ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని హిట్ 3 సినిమాలో నటిస్తున్నారు.. ఈ సినిమాకు ముందు సరిపోద్దా శనివారంతో బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు .. ఈ సినిమా కూడా 100 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.. అంతకు ముందు దసరా సినిమా కూడా 100 కోట్లు రాబపెట్టిన విషయం తెలిసిందే .. ఏదైనాప్పటికీ తనకు ఇష్టమైన హీరో అంటే తన తాత ఎన్టీఆర్ పేరు చెప్పేవాడు కానీ ప్రస్తుత హీరోల్లో నాని పేరు చెబుతుండటం పై నాని అభిమానులు కూడా సంబరపడుతున్నారు..