విక్టరీ వెంకటేష్ గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫాన్స్ తో సంబంధం లేకుండా సినిమాలు అడగలిగే హీరో చిత్ర పరిశ్రమలో ఎవరన్నా ఉన్నారు అంటే అది వెంకటేష్ మాత్రమే. అవును, అతని సినిమాలను దాదాపు అందరి ఫాన్స్ ఇష్టపడతారు. అసలు విషయంలోకి వెళితే.. తాజాగా బాలకృష్ణ షో అన్‌స్టాపబుల్ కి వచ్చిన వంకటేష్ అనేక ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు. కాగా వెంకటేష్ వచ్చిన ఎపిసోడ్ ఆహా ఓటీటీలో తాజాగా రిలీజయింది.

ఇద్దరు స్టార్ హీరోలు ఒక షోలో సందడి చేస్తే ఎలా ఉంటుందో ఈ షో ఆద్యంతం అంత సరదాగా సాగింది. మరోవైపు ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడిగినట్టు బాలయ్య వెంకీమామను ప్రశ్నలు అడగడంతో ఈ ఎపిసోడ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఎపిసోడ్లో వెంకటేష్ అనేక అంశాల గురించి ప్రస్తావించడం జరిగింది. వెంకటేష్ గతంలో మహేష్ బాబుతో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, పవన్ కళ్యాణ్ తో కలిసి గోపాల గోపాల సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ రెండు ఇంచుమించుగా ఒకేవిధంగా ఆడాయి. బాలయ్య ఈ సినిమాల ప్రస్తావన తెచ్చి పవన్, మహేష్ గురించి అడిగారు.

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' సినిమాలో వెంకటేష్.. మహేష్ బాబుని పూలకుండీ ఎందుకు తన్నావురా? అని అడుగుతాడు గుర్తుందా? ఈ సీన్ ని చూపించి మరీ బాలయ్య మహేష్ గురించి అడగగా... దీనికి వెంకటేష్.. ఈమధ్యే మహేష్ కి మెసేజ్ కూడా చేశాను.. పూలకుండీ ఎందుకు తన్నావు? అని. కానీ రిప్లై మాత్రం అటునుండి రాలేదు. అని వెంకటేష్ సరదాగా చెప్పుకొచ్చాడు. మహేష్ అందరినీ ఒకేవిధంగా గౌరవిస్తాడు. షూటింగు సమయంలో ఒకరికొకరు బాగా దగ్గరయ్యాం. నిజమైన అన్నదమ్ముల్లాగే చేశాము. ఇప్పుడు కలవకపోయినా ఎప్పుడన్నా కలిస్తే నా చిన్న తమ్ముడిలా అనిపిస్తాడు అని వెంకీ తెలిపాడు.

అదేవిధంగా బాలయ్య పవన్ గురించి అడగ్గా.. సినిమాల కంటే ముందే పవన్ తో నాకు మంచి పరిచయం ఉంది. దాంతో సినిమాలో మా కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. పవన్ మా ఇంటికి అప్పుడప్పుడు వచ్చేవాడు. నా దగ్గర లేజర్ డిస్క్ లు ఉండేవి వాటి కోసం ఎక్కువగా వచ్చేవాడు. మేమిద్దరం భక్తి భావంతో కనెక్ట్ అయ్యాం అని చెప్పుకోవాలి. . ఇద్దరం ఎక్కువ సైలెంట్ గా ఉంటాము. ఆ సైలెంట్ లోనే ఒకరికొకరు అర్ధం చేసుకుంటాం అని అన్నారు. దీంతో వెంకీమామ పవన్, మహేష్ లపై చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: