రేవంత్ రెడ్డితో సినీ సభ్యులు మీటింగ్ తరువాత ఇండస్ట్రీలో ఊహించనివి జరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు బన్నీ ను కలిసి ఆయన భజన చేసిన స్టార్స్ ఇప్పుడు రివర్స్ అవుతూ.. తప్పు అంతా బన్నీ దే అంటూ మాట్లాడుతున్నారు. అయితే ఈ మీటింగ్ లో టాలీవుడ్ పెద్ద తలకాయ అయినా చిరంజీవి రాలేదు. దానికి రకరకాల కారణాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తాజాగా మరొక సెన్సేషనల్ వార్త బయటకు వచ్చింది .


అసలు చిరంజీవిని ఆ మీటింగ్ కి రావద్దు అంటూ రేవంత్ రెడ్డినే స్వయంగా తన టీం చేత కాల్ చేయించి చెప్పారట . చిరంజీవి మనస్తత్వం గురించి ..చిరంజీవి గుణం గురించి అందరికీ తెలిసిందే . చాలా మంచి వ్యక్తి . తాను ఒక దెబ్బతిన్న పర్వాలేదు .. ఎదుటి వాళ్లు సంతోషంగా ఉంటే చాలు అనుకునే టైప్. అయితే అల్లు అర్జున్ చేసిన విషయంలో తప్పు అల్లు అర్జున్ ది అని తెలుసు కానీ చిరంజీవి తన మేనల్లుడు కోసం కచ్చితంగా కాస్తో కూస్తో డౌన్ అయ్యి సమావేశంలో ఏదో ఒక విషయం గురించి మాట్లాడుతారు.  ఆ టైంలో చిరంజీవికి నెగిటివ్ గా నేను ఆన్సర్ ఇవ్వలేను.. చిరంజీవి చాలా చాలా సమాజసేవ కలిగిన వ్యక్తి .



కరోనా మూమెంట్ లోను సొంత డబ్బులతో కార్మికులకు.. ప్రభుత్వ ఆసుపత్రులకు.. సామాన్య జనాలకు ఎన్నెన్నో ఆక్సిజన్ సిలిండర్లు అందజేశారు.  బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తం పంపించడం లాంటివి కూడా చేశారు . ఇక చిరంజీవి బ్రదర్ పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు . రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలి అన్నా ..చిరంజీవి గౌరవం అలాగే ఉండాలి అన్నా..చిరంజీవి మర్యాదను కాపాడాలి అన్నా.. చిరంజీవి ఈ మీటింగ్ కి రాకపోతేనే బెటర్ అంటూ తన పరసనల్ టీం దగ్గర నుంచి మెగాస్టార్ చిరంజీవికి కాల్ చేయించి మరి మీటింగ్ కి రావద్దు అంటూ చెప్పారట రేవంత్ రెడ్డి . ఈ వార్తలో ఎంత నిజం ఉంది అనేది తెలియనప్పటికీ జనాలు మాత్రం ఫుల్ ఫిదా అయిపోతున్నారు . మెగా ఫాన్స్ అయితే అసలు ఆనంద పడిపోతున్నారు . నీలాంటి సీఎం ఈ రాష్ట్రానికి కావాల్సింది.. మెగా స్టార్ చిరంజీవి పరువును బాగా కాపాడారు అంటూ పొగిడేస్తున్నారు. మెగా అభిమానుల కోసం గేమ్ చేంజర్ విషయంలో కూడా కొంచెం టికెట్ రేట్లు పెంచు అన్నా అంటూ సజెస్ట్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ వార్త బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: