తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో వెంకటేష్ తన కుటుంబం గురించి చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఎలాంటి విభేదాలకు కూడా స్థానం కల్పించరు. ఇటీవలే అన్ స్టాపబుల్ షోలో గెస్ట్ గా వచ్చిన వెంకటేష్ పలు విషయాలను తెలియజేశారు. ఇందులో బాలయ్య ఎన్నో ప్రశ్నలు అడిగిన వెంకటేష్ వెంటనే సమాధానాలను కూడా తెలియజేశారు. ఈ షోకి వెంకటేష్ అన్నయ్య సురేష్ బాబు కూడా రావడం జరిగింది. ఈ క్రమంలోనే వీరిద్దరిని కలిపి బాలయ్య పలు ప్రశ్నలు అడిగారు.



ముఖ్యంగా ప్రముఖ నిర్మాత నటుడుగా పేరుపొందిన దివంగత నటుడు రామానాయుడు గురించి అడిగారు. అలాగే తన తండ్రి చివరి రోజుల గురించి వెంకటేష్, సురేష్ బాబు చెబుతూ చాలా ఎమోషనల్ గా మాట్లాడడం జరిగింది.. వెంకటేష్ మాట్లాడుతూ ఆయన వల్లే మేము ఈ స్థానంలో ఉన్నాము..ఆయన జీవితం అంతా కూడా సినిమాలకే అంకితం చేశారు.. కానీ కుటుంబాన్ని సినిమాలని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేశారని.. ముఖ్యంగా తన తండ్రి మరణించే చివరి క్షణాలలో కూడా సినిమా స్క్రిప్టు చదువుతూ ఉండేవారని.. అలా చదివిన స్క్రిప్టులలో ఒకటి నచ్చి తనకు చెప్పారని ఆ సినిమా చేస్తే బాగుంటుందని చెప్పారు... అలాగే ఈ కథలో తనతో పాటు నటించాలనుకున్నారు కానీ ఆయన ఆరోగ్యం సరిగ్గా లేకపోయిందని తెలిపారు.


అలా ఆ సినిమా చేయలేకపోయామని ఆ తర్వాత చాలా బాధపడ్డామని కూడా తెలిపారు. ఆయన కోసం ఈ సినిమా చేసి ఉంటే బాగుండేదేమో ఆయన చివరి రోజుల్లో కోరిక తీర్చలేకపోయానని బాధపడ్డానని తెలిపారు. తన తండ్రి తమ కుటుంబం కోసమే చాలా కష్టపడ్డారని తెలిపారు. సురేష్ బాబు మాట్లాడుతూ తన తండ్రి కోరిక కృషి విజ్ఞాన కేంద్రం పెట్టాలని చాలాసార్లు అనుకున్నారు.. కానీ ఆయన బ్రతికి ఉన్నప్పుడు చేయలేకపోయాను.. తన తండ్రి మరణించాక ఏకలవ్య కృషి విజ్ఞాన కేంద్రం పెట్టానని.. తన తండ్రి మంచి చేసిన కూడా ఎంపీగా ఓడిపోయాననే బాధ అలాగే వెంకటేష్ తో  సినిమా చేయలేదని ఈ రెండు విషయాలు తన తండ్రిని చాలా బాధపెట్టాయని ఎమోషనల్ గా తెలిపారు సురేష్ బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: