
దాంతో రౌడీ బాయ్ ఫాన్స్ చాలా నిరాశగా ఉన్నారు. తమ హీరోనుండి సూపర్ హిట్ చిత్రమొచ్చి చాలా సంవత్సరాలు అయిపోయిందని ఫీల్ అవుతున్నారు. ఈ తరుణంలో అభిమానులకు ప్రముఖ సినిమా నిర్మాత 'నాగవంశీ' ఓ కిక్కిచ్చే కబురిని చెప్పుకొచ్చాడు. అవును, ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘VD12’తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకి ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ సినిమా విజయ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ వంశీ ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాడు. అవును... ‘‘VD12’ 2 పార్టులుగా రాబోతోందని, సినిమా అవుట్ ఫుట్ అదిరిపోయిందని చెప్పుకొచ్చాడు. ఇక రెండు పార్టులు అన్న ఆలోచన సినిమా తీస్తున్న టైంలో రాలేదు కానీ స్క్రిప్ట్ అనుకున్నప్పుడే ఈ ఆలోచన వచ్చింది... అంటూ షాక్ ఇచ్చాడు. అయితే ఫస్ట్ పార్ట్‌కి, సెకండ్ పార్ట్‌కి అసలు సంబంధం ఉండదు అంటూ చెప్పుకొచ్చాడు నాగ వంశీ. మొదట సినిమా కథ అనుకున్నప్పుడు 2 పార్టులుగా అనుకున్నారట. సెకండ్ పార్ట్ తీయాలి కాబట్టి.. ఫస్ట్ పార్ట్‌లో సస్పెన్స్ అనేది ఉండాలి. కానీ ప్రస్తుతం చేస్తున్న కథ మాత్రం అలా రొటీన్ సినిమా కదలాలా కాకుండా డిఫరెంటుగా ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా 2 సపరేట్ కథలు అని చెప్పుకొచ్చారు. దాంతో ప్రజెంట్ నాగవంశీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.