మరో మూడు రోజుల్లో మనం 2024వ సంవత్సరానికి టాటా చెప్పబోతున్నాము. ఈ సంవత్సరం సినిమాల హిట్స్, ఫట్లు పక్కనపెడితే కొంతమంది టాలీవుడ్ స్టార్లు చాలా రకాల ఇబ్బందులకు గురయ్యారని చెప్పుకోవచ్చు. అవును, మీరు విన్నది నిజమే.. కొంతమంది సినిమా వాళ్ళని ‘సినిమా’ కష్టాలు బాగానే వెంటాడాయి. ఇక్కడ మొదటగా చెప్పుకోవలసింది హీరో రాజ్ తరుణ్ గురించి. ప్రేమ పేరుతో మోసం చేసి, కడుపు చేయడమే కాకుండా... పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేస్తున్నాడని హీరో రాజ్ తరుణ్‌పై ఓ యువతి ఫిర్యాదు చేసింది. దాదాపు ఐదు నెలల క్రితం జరిగిన ఈ విషయం ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోవడం కొసమెరుపు.

ఆ తరువాత ఓ లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ ని అడ్డంగా ఇరికించగా జానీ మాస్టర్ అరెస్టు అయ్యి, 14 రోజులు రిమాండ్లో కూడా ఉన్నాడు. ఈ తంతు ఎంత సంచలనం అయ్యిందో అందరికీ తెలిసినదే. ఈ క్రమంలో జానీ నేషనల్ అవార్డుని కూడా మిస్ చేసుకున్నాడు. ఆ తరువాత HYDలో Nకన్వెన్షన్ కూల్చివేత ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ అయింది. ఈ క్రమంలోనే నాగార్జున ఫ్యామిలీపై కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ తరువాత మంచు ఫ్యామిలీలో వివాదం చెలరేగిన సంగతి కూడా అందరికీ తెలుసు. అన్నదమ్ములు, తండ్రి మధ్య విభేదాలు చెలరేగి ఇంట్లో విషయం కాస్త రోడ్డున పడింది. ఈ క్రమంలో గాయపడిన ఓ జర్నలిస్టు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. కాగా దీనికి కారణమైన మోహన్ బాబుని ఈరోజో రేపు పోలీసులు అరెస్ట్ కూడా చేయనున్నారని సమాచారం.

ఇక వివాదాల వర్మ గురించి అందరికీ తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాని అడ్డగోలుగా వినియోగిస్తున్న RGV టీడీపీ, జనసేన నాయకుల్ని కించపరిచే విధంగా చేసిన పోస్టులకు గాను వర్మని త్వరలో అరెస్ట్ చేయనున్నారు. ఇప్పటికే పలుమార్లు పోలీసులు నోటీసులు పంపడం కూడా జరిగింది. ఇక ఇక్కడ అందరికంటే ఎక్కువగా చెప్పుకోవాలంటే.. హీరో, ఐకాన్ బాబు అల్లు అర్జున్ అరెస్టు గురించి మాట్లాడుకోవాలి. పుష్ప పార్ట్ 2 విడుదల నేపథ్యంలో హైద్రాబాదులోని సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అనేక రకాల ఆరోపణులు ఎదుర్కుంటూ ఉన్నాడు. మరోమారు అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ కి వెళ్లే సూచనలు కూడా లేకపోలేదు. ఈ రకంగా 2024 సంవత్సరం కొంతమంది తరాలకు చేదు అనుభవాలనే మిగిల్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: