ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రభాస్ అందరికీ గురువుగా మారుతున్నాడు. అప్పుడు పాన్ ఇండియా మార్కెట్ పరిచయం చేసిన రెబల్ స్టార్ ఇప్పుడు మరో విషయంలోనూ హీరోలకు మార్గ నిర్దేశం చేస్తున్నారు .. మరియు ముఖ్యంగా రామ్ చరణ్ - ఎన్టీఆర్ అయితే గుడ్డిగా ప్రభాస్‌ను నమ్ముకుంటూ వెళ్లిపోతున్నారు .. మరి అది ఎలా ? వారు ఏ విషయంలో ప్రభాస్‌ను ఫాలో అవుతున్నారు ఇక్కడ చూద్దాం. బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా మార్కెట్ కు దారి చూపించాడు ప్రభాస్ అయితే ఆ సినిమా తర్వాత మరో విషయంలోను ప్రభాస్ అందరికి గురువుగా మారాడు .. అది గ్యాప్ లేకుండా వరుస‌ సినిమాలు చేయడమనే కాన్సెప్ట్. సాహో  తర్వాత ప్రభాస్ ఈ ఫార్ములానే అన్నిటికీ అప్లై చేస్తున్నారు.. అందుకే సంవత్సరానికో సినిమా విడుదల చేస్తున్నాడు.


ఒకేసారి మూడు నాలుగు సినిమాలకు ఓకే చేయడం వల్ల తక్కువ గ్యాప్ లోనే రాధే శ్యామ్ , ఆదిపురుష్ , సలార్ వచ్చాయి .. ఇక 2024 లో కల్కి కి వచ్చింది.. 2025 ఏప్రిల్ 10న రాజా సాబ్ రాబోతుంది .. ఇదే రూట్ రామ్ చరణ్ ఫాలో అవుతున్నాడు .. గేమ్ చేంజెర్‌ షూటింగ్ చివరి దశకు రాగానే బుచ్చిబాబు , సుకుమార్ సినిమాలను వారం గ్యాప్ లోనే ప్రకటించాడు. ఒకవైపు గేమ్ చేంజర్ ప్రమోషన్ లో పాల్గొంటూనే.. తన 16వ సినిమా షూటింగ్లో  జాన్ అయ్యాడు రామ్ చరణ్.. ఇక సంక్రాంతి తర్వాత పూర్తిస్థాయిలో బుచ్చిబాబు సినిమాపై ఫోకస్ పెట్టబోతున్నాడు. ఇక 2025 జూన్ లేపు 16వ సినిమా షూటింగ్ పూర్తి కాబోతుంది.. అలాగే 2025 డిసెంబర్ నుంచి సుకుమార్ సినిమా మొదలయ్యే అవకాశం ఉంది.. ఇలా ఈ రెండు సినిమాలను తక్కువ గ్యాప్లో రిలీజ్ కూడా చేయబోతున్నాడు.


ఇక మ్యాన్ ఆఫ్ మాస‌స్‌ ఎన్టీఆర్ సైతం ఇదే రూట్ లో ఫాలో అవుతున్నాడు .. దేవరతో పాటే వార్ 2కి డేట్స్ ఇచ్చేశాడు ఎన్టీఆర్ ... దేవర విడుదలయ్యాక వార్ 2 కంప్లీట్ చేస్తున్నాడు. 2025 సమ్మర్ లోపే వార్‌2 పూర్తికానుంది.. ఆ వెంటనే ప్రశాంత్ నీల్‌ సినిమా రెడీగా ఉంది .. ఇది కంప్లీట్ అయ్యేలోపు దేవర2 స్క్రిప్ట్ సిద్ధం చేయనున్నాడు కొరటాల .. ఇలా వరుస సినిమాలను ఓకే చేస్తే.. ఎంత అడ్వాంటేజ్ ఉందో ప్రభాస్ చూపించాడు ఇప్పుడు అదే రూట్ను ఎన్టీఆర్ , చరణ్ ఫాలో అయి చూపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: