ఒకటి కంప్లీట్ అయింది. జోరు పెంచితే మాత్రం రెండోది కూడా సిద్ధమయ్యే అవకాశాలు కచ్చితంగా కనిపిస్తున్నాయి .. ఇంతకీ రెడీ అయినా ఒకటేంటి .. జోరు చూపించాల్సిన ఆ రెండోది ఏంటి ? అనుకుంటున్నారా.. చిరంజీవి నుంచి రామ్ చరణ్ కెరియర్ మీద ఫోకస్ పెంచితే అసలు విషయం అర్థమైపోతుంది .. ఇంకెందుకు అసలు స్టోరీ ఎంటో ఇక్కడ చూసేద్దాం. వచ్చే సంక్రాంతికి రావాల్సిన విశ్వంభరను రామ్ చరణ్ గేమ్ చేంజర్ కోసం పోస్ట్ పోన్ చేసుకున్నాడు మెగాస్టార్.. 2025 కి ఆల్రెడీ ఓ సినిమా రిలీజ్ కన్ఫర్మ్ అయింది .. అలాగే శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమాను అనౌన్స్ చేశాడు .. అనిల్‌ రావిపూడి  ప్రాజెక్టు కూడా లైన్లో ఉంది .. యంగ్ దర్శకులు ఎవరైనా జోరు చూపించిన ఇంకో సినిమా థియేటర్లోకి తీసుకొచ్చే అవకాశాలు కచ్చితంగా కనిపిస్తుంది .


ఇక నట‌సింహం బాలయ్య కెరీర్ లోను సేమ్ సీన్ కనిపిస్తుంది .. సంక్రాంతికి డాకు మహారాజ్ తో రాబోతున్నాడు నట‌సింహం. అలాగే ఇప్పటికే అఖండ 2 ప్రీ ప్రొడక్షన్ పనులు మంచి ఊపు మీద జరుగుతున్నాయి .. బోయపాటి ఇదే స్పీడ్ పెంచితే 2025 చివరికల్లా అఖండ తాండవాన్ని థియేటర్లో చూడొచ్చని ఫ్యాన్స్ కోరిక. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రెండు సినిమాలు వచ్చే కొంత సంవత్సరం పక్కా రావొచ్చు అనేది ఎప్పటినుంచో వినిపిస్తున్న మాట .. ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తికావొచ్చింది .. అలాగే ఓజీ కి కూడా ఇంకొన్నాళ్ళు పాటు కాల్ షీట్స్ ఇస్తే కంప్లీట్ అవుతుంది.. సో నెక్స్ట్ ఇయర్ పవన్ కళ్యాణ్ అభిమానులకు డబల్ ధమాకా గట్టిగా రెడీగా ఉంది.


ఇక రామ్ చరణ్ కూడా గేమ్ చేంజ‌ర్ తో సంక్రాంతికి పలకరించడానికి రెడీగా ఉన్నాడు .. అలాగే బుచ్చిబాబు ప్రాజెక్టు  షూటింగు మొదలుపెట్టాడు.. వచ్చే సంవత్సరం ఇయర్ ఎండింగ్ రిలీజ్ ప్లాన్ చేసుకున్న ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇక వీరితో పాటు రేసులో నేనున్నానని నాని కూడా సై అంటున్నాడు.. శ్రీకాంత్ ఓదెల సినిమా, హిట్ 3 తో ప్రేక్షకులను పలకరించడానికి ఈ నేచురల్ స్టార్ రెడీగా ఉంటారన్నది  టాక్ .. అన్నీ కుదిరితే ఈ రెండు సినిమాలు కూడా 2025 లోనే వచ్చేస్తాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: