బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలీన్ ఫెర్నాండెజ్  మరోసారి వార్తల్లో హైలైట్ గా మారింది .. ఆమెకు ఆర్థిక నేరస్థుడు ఒకడు పంపిన భారీ గిఫ్ట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది .. క్రిస్మస్ కానుకగా ఆమెకు ఎంతో ఖరీదైన గిఫ్ట్ను పంపించాడు ఆర్థిక నేరస్థుడు సుఖేష్ చంద్రశేఖర్ .. అలాగే క్రిస్మస్ మెసేజ్ కూడా ఒక లెటర్ రూపంలో పంపిస్తూ బేబీ గర్ల్‌ మై లవ్ యు అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. బేబీ గర్ల్ మేరీ క్రిస్మస్ మై లవ్ మనకెంత ఇష్టమైన పండుగ ఇది అంటూ ఆ లెటర్ ను మొదలుపెట్టాడు.. కాకపోతే ఇది మనిద్దరం కలిసి జరుపుకోలేకపోతున్నాం ఏది ఏమైనా మన మనసులు ఎంతో దగ్గరగా ఉన్నాయని ఆ లెటర్లో రాసుకోవచ్చాడు.


నీ చేతులు పట్టుకుని అందమైన నీ కళ్ళలో చూస్తూ క్రిస్మస్ విషెస్ చెప్పాలని ఉంది దూరంగా ఉన్నప్పటికీ నేను నీ శాంతాక్లాజ్  ను కాకుండా ఎవరూ ఆపులేరంటూ ఇంట్రెస్టింగ్ ఆ లెటర్ రాశాడు.. అలాగే ఈ సంవత్సరం నీకు చాలా ప్రత్యేకమైన బహుమతి ఇవ్వాలనుకుంటున్నానని.. ఈరోజు నీకు వైన్ బాటిల్ గిఫ్ట్ గా ఇవ్వడం లేదని నువ్వు ఎప్పుడు కలలు కనే కంట్రీ ఆఫ్ లవ్ గా అభివర్ణించే పారిస్ లో ఒక వైన్ యార్డ్ నే ఇస్తున్నానంటూ కామెంట్ చేశాడు. అలాగే ఆ తోటలో నీ చేయి పట్టుకుని  నడవాలని ఉంది అంటూ తన మనసులో మాటని బయటపెట్టాడు.


ఇక నేనొక పెద్ద పిచ్చోన్ని ఈ ప్రపంచం అనుకోవచ్చు.. నీ ప్రేమలో నిజంగానే నేను పిచ్చోడ్ని అయ్యా నేను రిలీజ్ అయ్యే వరకు ఎదురు చూస్తూనే ఉండు.. ఆ తర్వాత ప్రపంచమే మన జంటను చూస్తూ ఆశ్చర్య పోతుంది అంటూ లెటర్ ను ముగించాడు. ఇక గతంలో కూడా సుకేష్ ఇలాగే ఆమెకు లెటర్లో రాస్తూ వచ్చాడు.. ప్రస్తుతం మరోసారి క్రిస్మస్ లెటర్ తో సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్ గా మారాడు


మరింత సమాచారం తెలుసుకోండి: