30 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ మార్కో మూవీ సుమారుగా రూ .80 కోట్ల వరకు రాబట్టినట్లు కలెక్షన్స్ ట్రెండ్ పండితులు తెలియజేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా తెలుగులో అలరించడానికి కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.. న్యూ ఇయర్ సందర్భంగా జనవరి ఒకటవ తేదీన మార్కో సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ట్రైలర్ ద్వారా తెలియజేశారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. జీవితంలో మనల్ని హార్న్ చేసే విషయం ఏంటో తెలుసా.. మనకు చాలా ఇష్టమైన వాళ్లని సైతం మన కళ్ళముందే చంపడం అనే డైలాగ్ తో ఈ ట్రైలర్ మొదలవుతుంది..
ఆ తర్వాత యాక్షన్స్ సన్నివేశాలు కూడా నెక్స్ట్ లెవెల్ లో చూపించారు మేకర్స్. ఒక్కోసిన్ కేజీఎఫ్ తరహాని మించి మరి ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇందులోను కొన్ని హింసాత్మకమైన సన్నివేశాలు కూడా చూపించారు.. ఉన్ని ముకుందన్ లుక్స్ కూడా ఈ చిత్రంలో చాలా స్టైలిష్ గా ఉండడమే కాకుండా చాలా వైలెన్స్ లుక్ లో కనిపించారు. ట్రైలర్ మాత్రం అందరిని ఆకట్టుకున్నట్టుగా కనిపిస్తోంది.మొత్తానికి సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసేలా మార్కో ట్రైలర్ కనిపిస్తోంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయిందని చెప్పవచ్చు. మరి సినిమా తెలుగు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.