మన ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శక ధీరులు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో కొంతమంది కిందిస్థాయి నుంచి వచ్చి సక్సెస్ అవుతుంటే మరికొంతమంది... వారసత్వాన్ని అందిపుచ్చుకొని సక్సెస్ అవుతున్నారు. ఇక విజయ్ బిన్నీ లాంటి... వాళ్లయితే అక్కినేని నాగార్జున సహాయంతో పైకి వచ్చారు. కొరియోగ్రాఫర్ గా ఉన్న విజయ్ బిన్నీ.... దర్శకుడిగా మరి సక్సెస్ అయ్యారు.


అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన సినీ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా "నా సామరంగ". ఇందులో ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. విజయ్ బిన్నీ నా సామిరంగ సినిమాతో దర్శకుడిగా మొదటిసారి పరిచయమయ్యాడు. ముఖ్యంగా నాగర్జున తన సినిమాల ద్వారా కొత్త హీరోయిన్లకు, దర్శకులకు చాన్సులు ఇస్తూ ఉంటాడు. కొత్త జానర్లతో ప్రయోగాలు చేస్తూ ఉంటాడు.


ఈ సినిమాకు శ్రీనివాస్ చిట్టూరి నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమాతోనే కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా మారాడు. నా సామిరంగా సినిమా 2024 జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలై మంచి సక్సెస్ అందుకుంది. 2024 జనవరి 14 సంక్రాంతి కానుకగా వచ్చిన నా సామిరంగా సినిమా రెండవ హిట్ సినిమాగా నిలిచింది. హనుమాన్ సినిమా తర్వాత బ్రేక్ ఈవెన్ కొట్టిన సినిమాగా నిలిచింది.


విజయ్ బిన్నీ మొదటి ప్రయత్నంలోనే దర్శకుడిగా మంచి సక్సెస్ అందుకున్నాడు. దీంతో డాన్సర్స్ యూనియన్ సంతోషం వ్యక్తం చేశారు. విజయ్ బిన్నీని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి కింగ్ నాగార్జున, అల్లరి నరేష్ ముఖ్య అతిథులుగా వచ్చారు. అక్కడ నాగార్జున నా మాట్లాడుతూ విజయ్ బిన్నీ విజన్, మేకింగ్ స్టైల్ గురించి చెబుతూ ప్రశంసలు కురిపించాడు. కొరియోగ్రాఫర్ నీ నమ్మి నాగార్జున మంచి అవకాశం ఇవ్వడంతో విజయ్ బిన్నీకి మంచి అవకాశాలు ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: