స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోని 'గోదారి గట్టు మీద రామచిలకవే' అనే పాట ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఈ పాట యూట్యూబ్‌లో అనతికాలంలోనే 50 మిలియన్ల వీక్షణలను పొందింది. అలాగే గోదారి గట్టు పాట ఇప్పుడు రీల్స్ చేసే వ్యక్తులకు ఇష్టమైనదిగా మారింది. ఏదైనా సినిమాపై హైప్ క్రియేట్ చేయడానికి ఒక్క పాట చాలు అని వింటూనే ఉంటాం. ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాంలోని 'గోదారి గట్టు' పాటతో అది మరోసారి రుజువైంది. ఇక ఈ పాటలో ప్రేమలో పడిపోయిన వారందరూ సినిమా కూడా హిట్ కొడుతుందని నమ్ముతున్నారు. ఇక ఈ సినిమాలో హీరో వెంకటేష్ ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. అయితే ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా  ఐశ్వర్య రాజేష్, మాజీ ప్రియురాలిగా మీనాక్షి చౌదరి కనిపించనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా..  ‘సంక్రాంతికి వస్తున్నాం’ 2025లో సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో హీరోయిన్లు గా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. ఈ సినిమాకు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇప్పటికే ప్రమోషన్ లో భాగంగా ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. రెండిటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు భీమ్స్ మంచి మ్యూజిక్ ఇచ్చినట్టు స్పష్టమవుతుంది. 18 ఏళ్ల తర్వాత విక్టరీ వెంకటేష్, రమణ గోగుల కాంబో మళ్లీ వస్తోంది. బ్లాక్‌బస్టర్ లక్ష్మి కోసం వెంకటేష్‌తో కలిసి పని చేసిన రమణ గోగుల ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫస్ట్ సింగిల్‌కి తన వాయిస్ ని అందించారు. అయితే వెంకీ మామ హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమా స్టోరీ లైన్ కూడా ఇటీవల లీక్ అయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: