ఏంటి రామ్ చరణ్ సుకుమార్,అల్లు అర్జున్ మధ్యలో చిచ్చు పెట్టారా.. ఇంతకీ రామ్ చరణ్ చేసిన తప్పేంటి ..అసలు సుకుమార్ అల్లు అర్జున్ మధ్యలో ఆయన ఎందుకు చిచ్చు పెట్టారు..అనేది ఇప్పుడు చూద్దాం అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో ఆర్య, ఆర్య 2 పుష్ప వన్,పుష్ప 2, వంటి సినిమాలు వచ్చాయి. ఇక వీరి కాంబోలో వచ్చిన నాలుగు సినిమాల కారణంగా వీరి మధ్య అత్యంత సాన్నిహిత్య పెరిగింది. అంతేకాదు సుకుమార్సినిమా ఫంక్షన్ లో మాట్లాడుతూ అల్లు అర్జున్ వల్లే నేను ప్రాణాలతో ఉన్నాను అని ఆర్య సినిమా టైమ్ లో జరిగిన ఒక ఘటన గురించి చెప్పుకొచ్చారు.అలా వీరి మధ్య ఎంతో మంచి బాండింగ్ ఉంది. రీసెంట్గా అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సమయంలో కూడా సుకుమార్ బన్నీకి ధైర్యం చెప్పారు.అయితే తాజాగా బన్నీని కష్టకాలంలో వదిలేసి సుకుమార్ రామ్ చరణ్ చెంతకు వెళ్లిపోయారు అంటూ సోషల్ మీడియాలో ఒక రూమర్ వినిపిస్తోంది. అంతేకాదు ఇద్దరి మధ్య రాంచరణ్ చిచ్చు పెట్టారు అని ఒక వార్త వైరల్ అవుతుంది. 

ఇక విషయంలోకి వెళ్తే.. రామ్ చరణ్ సుకుమార్ కాంబోలో రంగస్థలం సినిమా వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే వీరి కాంబోలో మరో సినిమా కూడా రాబోతున్నట్టు ఈ మధ్యకాలంలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ పై కేసు ఉండి ఆయన ఇంట్లో కూర్చొని ఎంతో బాధపడుతూ ఉన్నారు. కానీ ఇలాంటి సమయంలో అల్లు అర్జున్  ని వదిలేసి సుకుమార్ రామ్ చరణ్ కి సంబంధించి గేమ్ చేంజర్ ప్రమోషన్స్ కోసం అమెరికా వెళ్లిపోయారట. ఇక ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ కోపంతో సుకుమార్ కి ఫోన్ చేసి నేను ఇలా కష్టంలో ఉంటే నువ్వు మాత్రం అమెరికా వెళ్లి ప్రమోషన్స్ చేసుకుంటున్నావా.. ఇదేనా మన మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ అంటూ తిట్టారట.దానికి సుకుమార్ కూడా మరి ఏం చేయను.. ఇప్పటికే మీరు మెగా ఫ్యామిలీని దూరం పెట్టి ఇబ్బందుల్లో పడుతున్నావ్.

మెగా ఫ్యాన్స్ మొత్తం సోషల్ మీడియాలో నిన్ను ఆడుకుంటున్నారు అని చెప్పారట.ఆయన మాటలకు అల్లు అర్జున్ కూడా బాధపడ్డట్టు తెలుస్తోంది. అంతేకాదు అల్లు అర్జున్ కష్టాల్లో ఉన్న సమయంలో సుకుమార్ ని అల్లు అర్జున్ నుండి రాంచరణ్ దూరం చేశారని, కావాలనే రామ్ చరణ్ సుకుమార్ ని తన మూవీ ప్రమోషన్స్ కోసం తీసుకెళ్లినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సుకుమార్మూవీ ప్రమోషన్స్ లో తనకి ఇప్పటివరకు చాలా దగ్గర అయిన హీరోల్లో రామ్ చరణ్ మాత్రమే ఉన్నారు అంటూ మాట్లాడడం అల్లు అర్జున్ తో పాటు అల్లు ఫాన్స్ కి కూడా మింగుడు పడడం లేదు. ఎందుకంటే ఇప్పటివరకు నాలుగు సినిమాలు తీసిన అల్లు అర్జున్ ని కాదని రామ్ చరణ్ మాత్రమే తన హృదయానికి దగ్గరైన హీరో అంటూ మాట్లాడడం చాలామంది అల్లు ఫ్యాన్స్ కి నచ్చడం లేదు.దాంతో అల్లు అర్జున్ సుకుమార్ మధ్య గొడవలు జరిగాయని, రామ్ చరణ్ వీరిద్దరి మధ్య చిచ్చు పెట్టారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ రూమర్స్ లో ఎంత నిజం ఉంది అనేది మాత్రం తెలియదు

మరింత సమాచారం తెలుసుకోండి: