సూపర్ స్టార్ రజనీ కాంత్ పోయిన సంవత్సరం జైలర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా ... రమ్యకృష్ణ ఈ సినిమాలో రజనీ కాంత్ కి భార్య పాత్రలో నటించింది. ఇక మిల్క్ బ్యూటీ తమన్నా ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో చాలా సంవత్సరాల తర్వాత సూపర్ స్టార్ రజినీ కాంత్ కి సూపర్ సాలిడ్ విజయం బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కింది.

మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ సినిమాకు కొనసాగింపుగా జైలర్ 2 అనే మూవీ ని రూపొందించబోతున్నట్లు అనేక రోజులుగా అనేక వార్తలు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మరికొన్ని రోజుల్లోనే జైలర్ 2 మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే సినిమాలో హీరోయిన్లుగా ఇద్దరు ముద్దుగుమ్మలను అనుకుంటున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమాలో కే జీ ఎఫ్ మూవీ లో హీరోయిన్గా నటించిన శ్రీ నిధి శెట్టి ని హీరోయిన్గా తీసుకోవాలి అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు , అలాగే తమన్నా ను కూడా హీరోయిన్గా తీసుకునే అవకాశాలు ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక రమ్యకృష్ణ పాత్రకు సంబంధించి పెద్దగా వార్తలు ఏమి రావడం లేదు. మరి రమ్యకృష్ణ మొదటి భాగంలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మరి అలాంటి పాత్రను లైట్ తీసుకుంటే సినిమా రిసల్ట్ కు ఎఫెక్ట్ అవుతుంది అని కొంత మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: