తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో అల్లరి నరేష్ ఒకరు. ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగించిన ఈ వీ వీ సత్యనారాయణ కుమారుడిగా తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం నటుడుగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే కెరియర్ ప్రారంభంలో వరుస పెట్టి కామెడీ ప్రాధాన్యత ఎక్కువ ఉన్న సినిమాల్లో నటించి ఎన్నో విజయాలను అందుకొని అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న అల్లరి నరేష్ ఈ మధ్య కాలంలో కామెడీ సినిమాలను కాస్త లైట్ తీసుకొని వైవిధ్యమైన పాత్రల్లో , సీరియస్ పాత్రల్లో నటిస్తూ వస్తున్నాడు.

అందులో భాగంగా తాజాగా అల్లరి నరేష్ "బచ్చల మల్లి" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దానితో ఈ సినిమాకు పెద్ద మొత్తంలోనే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. కానీ ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజే మిక్స్ డ్ రావడంతో ఈ మూవీ కి పెద్ద స్థాయిలో కలెక్షన్లు రావడం లేదు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 8 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 8 రోజుల్లో ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.35 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్లు వసూలు కాగా , ప్రపంచ వ్యాప్తంగా 1.55 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్లు వసూలు అయినట్లు తెలుస్తోంది.

మొత్తంగా ఈ మూవీ కి వరల్డ్ కప్ 3.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ మూవీ 5.50 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగగా మరో 4 కోట్లు షేర్ కలెక్షన్లు ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా వస్తే ఈ మూవీ విజయాన్ని అందుకుంటుంది. ఇక ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే ఈ మూవీ కి దాదాపు మూడు నుంచి 3 నుండి 3.50 కోట్ల వరకు నష్టం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: