2024 వ సంవత్సరం ముగింపు దశకు వచ్చేసింది. ఇప్పటికే ఈ సంవత్సరం అనేక తెలుగు సినిమాలు విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు అద్భుతమైన విజయాలను సాధిస్తే మరికొన్ని సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇక కొన్ని సినిమాలు భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టగా కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షాన్ని కురిపించాయి. ఇక మరికొన్ని రోజుల్లోనే కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. ఇక కొత్త సంవత్సరం ప్రారంభంలోనే అనేక భారీ సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి.

వచ్చే సంవత్సరం జనవరి 10 వ తేదీన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజర్ మూవీ విడుదల కానుండగా , ఆ తర్వాత బాలయ్య హీరో గా రూపొందిన డాకు మహారాజ్ సినిమా జనవరి 12 వ తేదీన విడుదల కానుంది. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందుతున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14 వ తేదీ విడుదల కానుంది. ఇకపోతే వచ్చే సంవత్సరం ప్రారంభంలో విడుదల కానున్న ఈ మూడు మూవీలకు సంబంధించిన ట్రైలర్స్ ఇప్పటివరకు విడుదల కాలేదు. కానీ ఈ మూడు సినిమాలకు సంబంధించిన ట్రైలర్స్ వచ్చే సంవత్సరం జనవరి మొదటి వారంలో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే వారం అన్ని సినిమాల కంటే ముందు డాకు మహారాజ్ మూవీ ట్రైలర్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ , ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం మూవీ ట్రైలర్ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా వచ్చే సంవత్సరం ప్రారంభంలో జనవరి మొదటి వారంలో ఈ మూడు మూవీలకు సంబంధించిన ట్రైలర్స్ రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: