ఫ్యాన్స్ ఎంత వైలెంట్ గా మారిపోయారో మనం చూస్తూనే ఉన్నాం . మరి ముఖ్యంగా తమ ఫేవరెట్ స్టార్ హీరోని ఇబ్బందులకు గురి చేస్తున్నా.. లేకపోతే తమ ఫేవరెట్ స్టార్ పై స్పందించకపోయినా.. నానారకాలుగా ట్రోల్ చేస్తూ ఉంటున్నారు . తాజాగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఇష్యూ ఎంత రాద్ధాంతం సృష్టించిందో అందరికీ తెలిసిందే. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందడం. అది అల్లు అర్జున్ కి బాగా నెగిటివ్గా మారిపోయింది . అల్లు అర్జున్ జైలుకు వెళ్లే పరిస్థితి కూడా తీసుకొచ్చింది .


అల్లు అర్జున్ బెయిల్ పై ఉన్నాడు. త్వరలోనే బెయిల్ కూడా క్యాన్సిల్ అయ్యి మళ్ళీ జైలుకి వెళ్ళిపోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అయితే అల్లు అర్జున్ అరెస్టు అవుతున్నాడు అని తెలిసినప్పుడు ఓ హీరో మాత్రం ట్వీట్టర్ వేదికగా ఓపెన్ గా స్పందించాడు . "ఇది తప్పు అంటూ వాదించాడు". అంత వరకు బాగానే ఉంది. అయితే అల్లు అర్జున్ అరెస్టు అయ్యి ఇంటికి వచ్చాక టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు మొత్తం ఆయన ఇంటికి వెళ్లి కనిపించినా కూడా ఆ హీరో మాత్రం స్పందించలేదు.



ఆ తర్వాత అసెంబ్లీలో ఆయన పేరు పై నిందలు పడినా కూడా ఆ హీరో స్పందించలేదు . అసలు ఆ హీరో ఎక్కడున్నాడు..? ఏం చేస్తున్నాడు..? అంటూ బన్నీ ఫ్యాన్స్ మండి పడుతున్నాడు. అసలు ఆ హీరో ఉన్నాడా..? లేడా చచ్చాడా..? అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. తూ తూ మంత్రంగా ఒక ట్వీట్ చేసి బన్నీ కష్టాల్లో ఉంటే ఆదుకోవడం తెలియదా..? అంటూ ఫైర్ అవుతున్నారు . అంతేకాదు "ఆ తెలుగు హీరో మిస్ అయ్యాడు కూసింత వెతికి పెట్టండి రా బాబు "అంటూ కూడా ఘాటుగా కౌంటర్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారిపోయింది. మొత్తానికి అల్లు అర్జున్ ఇష్త్య్య్ ఇప్పుడు ఇండస్ట్రీని ని బాగా కుదిపేస్తుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: