టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్లు, టాలెంటెడ్ హీరోలు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. అయితే ఒక సినిమా సక్సెస్ కావడం అంటే సులువైన విషయం కాదు. గతంతో పోల్చి చూస్తే పరిస్థితులు సైతం పూర్తిగా మారిపోయాయి. కంటెంట్ మరీ అద్భుతంగా ఉంటే తప్ప సినిమాలు సక్సెస్ సాధించడం లేదని చెప్పవచ్చు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ సక్సెస్ లో రాజమౌళి కీలక పాత్ర పోషించగా బన్నీ కెరీర్ సక్సెస్ లో సుకుమార్ కీలక పాత్ర పోషించారు.
 
ఈ స్టార్ డైరెక్టర్లు హీరోల జాతకాలను మార్చేశారని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు రాజమౌళి, సుకుమార్ సక్సెస్ రేట్ ఎక్కువనే సంగతి తెలిసిందే. ఈ డైరెక్టర్లు సినిమాలు అంటే ప్రాణం పెట్టి పని చేస్తున్నారు. ఎన్టీఆర్, అల్లు అర్జున్ సైతం సినిమాల కోసం పడే కష్టం అంతాఇంతా కాదు. ఈ హీరోలు ఒక్కో మెట్టు పైకి ఎదిగి ఈ స్థాయి చేరుకున్నారు.
 
కెరీర్ తొలినాళ్లలో అటు ఎన్టీఆర్ ఇటు అల్లు అర్జున్ లుక్స్ విషయంలో తీవ్రస్థాయిలో విమర్శలను ఎదుర్కోవడం జరిగింది. అయితే ఈ హీరోలు తర్వాత రోజుల్లో ఒక్కో మెట్టు పైకి ఎదిగి ప్రశంసలు అందుకున్నారు. సోషల్ మీడియాలో, ఇతర భాషల్లో సైతం ఈ హీరోలకు క్రేజ్ మామూలుగా లేదని చెప్పవచ్చు. ఎన్టీఆర్, బన్నీ మరిన్ని విజయాలు అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
 
ఎన్టీఆర్, బన్నీ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే కెరీర్ పరంగా మరిన్ని సంచలనాలను సృష్టించే అవకాశాలు అయితే ఉన్నాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వార్2 సినిమాతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్ పుష్ప ది రూల్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నేపథ్యంలో బన్నీ తర్వాత సినిమాలు సైతం బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలికాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: