రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం గేమ్ ఛేంజర్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించగా జనవరి 10వ తేదీన వచ్చేయేడానికి థియేటర్లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్లో సైతం చిత్ర బృందం యాక్టివ్గానే ఉన్నది. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయడానికి కూడా చిత్ర బృందం ఒక ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గేమ్ ఛేంజర్ సినిమా చరణ్ కెరియర్ లోనే బెస్ట్ మూవీ అవుతుందంటూ మేకర్స్ అయితే ఇప్పటివరకు హైప్ పెయిన్ చేస్తూ ఉన్నారు. ఇందులో డ్యూయల్ పాత్రలలో రామ్ చరణ్ కనిపించబోతున్నారు.


తండ్రి కొడుకులు గా రెండు విభిన్న పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఒక పాత్రకి కియారా అద్వానీ, మరొక పాత్రకి హీరోయిన్ అంజలి నటించబోతోంది. అయితే అంజలి పాత్ర ఈ చిత్రంలో చాలా కీలకమని అందుకే శంకర్ రివిల్ చేయలేదని విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. కియారా అద్వానీ మీదే ఎక్కువగా పాటలు అన్ని చిత్రీకరించారని సమాచారం. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో రామ్ చరణ్ ,అంజలి పైన ఒక కీలకమైన సాంగ్ ఉంటుందని టాక్ మాత్రం వినిపిస్తున్నది. అంజలి రోల్ కూడా గేమ్ ఛేంజర్ గా ఉంటుందట. అందుకే ఆమెను చాలా స్పెషల్ గా ఈ సినిమాలో చూపించబోతున్నట్లు సమాచారం.


ఈ సినిమాలో స్టోరీని మలుపు తిప్పే క్యారెక్టర్లలో అంజలి కనిపించబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. చాలాకాలం తర్వాత అంజలి నటిస్తున్న బడ సినిమా కావడంతో ఈమె పాత్ర ఎలా ఉంటుందో అంటూ అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్గా ఎదురుచూస్తున్నారు.  డైరెక్టర్ శంకర్ కూడా హీరోయిన్స్ ని ఏ రేంజ్ లో చూపిస్తారో చెప్పాల్సిన పనిలేదు.. అంజలి పాత్ర బలంగా ఉండడం వల్లే ఈ సినిమా పై చిత్ర బృందం ధిమా వ్యక్తం చేస్తున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. దిల్ రాజు కూడా ఈ సినిమా కథ మీద బలంగా నమ్మకం ఉండడం వల్లే అంత ఖర్చు చేశారని సమాచారం. మరి గ్లోబల్ స్టార్ గా రామ్ చరణ్ ఏ విధంగా ఈ సినిమాతో మెప్పిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: