ఏంటి ఇది నిజమేనా..ప్రశాంత్ వర్మ పై హీరోయిన్ అమృత అయ్యర్ ఫైర్ అయిందా.. ఇంతకీ అమృత అయ్యేర్ తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్ట్ కి అర్థమేంటి.. ప్రశాంత్ వర్మపై నిజంగానే తనకి కోపం ఉందా.. వారిద్దరి మధ్య గొడవలు వచ్చాయా అనేది ఇప్పుడు చూద్దాం.. ప్రశాంత్ వర్మ.. ఒక చిన్న దర్శకుడి నుండి పాన్ ఇండియా స్థాయికి ఎదగడం అంటే మామూలు విషయం కాదు.అలా గుర్తింపు తెచ్చుకోవడం వెనుక ఎంతో కష్టం దాగి ఉంటుంది. అలా ఈ ఏడాది హనుమాన్ మూవీతో ఇండియాలోనే అతిపెద్ద హిట్ కొట్టిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ... ఈ ఏడాది హైయ్యెస్ట్ కలెక్షన్ సంపాదించిన సినిమా అంటే అందరూ పుష్ప 2, కల్కి వంటి సినిమాలు అనుకుంటారు. కానీ అవేవి కాదు. హనుమాన్ మూవీనే అన్ని సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమా. ఎందుకంటే హనుమాన్ మూవీ బడ్జెట్ తక్కువే కానీ కలెక్షన్లు మాత్రం ఎక్కువ కాబట్టి ఈ సినిమానే ఈసారి హైయెస్ట్ కలెక్షన్స్ సంపాదించిన సినిమా. 

అయితే అలాంటి హనుమాన్ మూవీ ద్వారా దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయిన దర్శకుడు ప్రశాంత్ వర్మ గురించి తాజాగా తన సోషల్ మీడియా  ఖాతాలో హీరోయిన్ అమృత అయ్యర్ షాకింగ్ పోస్ట్ పెట్టింది..ఇక అమృత అయ్యర్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే మూవీ లో యాంకర్ ప్రదీప్ తో హీరోయిన్గా చేసింది. కానీ ఈమె నటించిన సినిమాలలో హనుమాన్ మూవీ మాత్రమే ఈమెకి పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చి పెట్టింది. అయితే అలాంటి మంచి హిట్ ని ఇచ్చిన దర్శకుడు గురించి తన సోషల్ మీడియా ఖాతాలో ఒక మీమ్ షేర్ చేసింది.అదేంటంటే రీసెంట్గా బాలకృష్ణ కొడుకు మోక్షాజ్ఞ మొదటి సినిమాకి డైరెక్టర్గా ప్రశాంత్ వర్మని అనుకున్నాక ఆ తర్వాత ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్టు వార్తలు వినిపించాయి.

అంతేకాదు బాలకృష్ణ చేతిలో ప్రశాంత్ వర్మ దెబ్బలు తిన్నట్టు కూడా రూమర్స్ వచ్చాయి. అయితే దీనికి సంబంధించిన మీమ్ ని అమృత అయ్యర్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో ఈ హీరోయిన్ కి ఏమైంది.. తనకి లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ పై అలాంటి మీమ్ షేర్ చేయడం ఏంటి? వీరిద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు కొంత మంది నెటిజెన్స్ అయితే అమృత అయ్యర్ ని ప్రశాంత్ వర్మ టార్చర్ చేశాడు కావచ్చు.. అసభ్యంగా ప్రవర్తించాడు కావచ్చు అందుకే ఈ విధంగా మీమ్ షేర్ చేసి తన పగ తీర్చుకుంటుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి అమృత అయ్యర్ సరదాగా ఆ మీమ్ షేర్ చేసిందా లేక నిజంగానే ప్రశాంత్ వర్మతో గొడవలు ఉన్నాయా అనేది మాత్రం తెలియదు

మరింత సమాచారం తెలుసుకోండి: