యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ బావమరిది నార్నే నితిన్, సంతోష్‌ శోభన్‌ తమ్ముడు సంగీత్ శోభన్, గౌరీ ప్రియా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మ్యాడ్‌.గతేడాదిలో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. గతేడాది రిలీజ్ అయిన మ్యాడ్ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా కామెడీ, పాటలు అన్ని కూడా కూడా యవతను బాగా ఆకర్షించాయి.ఇప్పుడు మ్యాడ్‌ స్క్వేర్‌ పేరుతో సీక్వెల్‌ రానుంది. మ్యాడ్‌ స్క్వేర్‌ సినిమా నుంచి యూత్‌ను ఆకట్టుకునే సాంగ్‌ను తాజాగా మేకర్స్‌ విడుదల చేశారు.మ్యాడ్ సినిమాలో ఉన్న నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మ్యాడ్ స్క్వేర్లో హీరోలుగా చేస్తున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ పాట రిలీజ్ అయ్యింది. నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి అంటూ లిరికల్ సాంగ్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సురేశ్ గంగుల సాహిత్యంలో భీమ్స్, స్వాతి రెడ్డి ఈ స్వాతి రెడ్డి పాటను పాడారు. ఎవరూ ఊహించని హీరోయిన్ రెబా మోనిక ఇందులో చిందులేశారు.ఈ పాటకి కాస్త డీజే మిక్స్ చేయడంతో సాంగ్ అదిరిపోయింది. పాటను విడుదల చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే యువతకి కిక్కు ఇస్తుంది.

ఈసారి న్యూ ఇయర్ పాట ఇదేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మ్యాడ్ స్క్వేర్ కూడా హిట్ కావడం పక్కా అని నెటిజన్లు అంటున్నారు.ఇప్పుడీ పాట టాప్‌లో ట్రెండింగ్ అవుతోంది.ఇదిలావుండగా మొదటి భాగంలో 'కళ్ళజోడు కాలేజ్ పాప' వంటి బ్లాక్ బస్టర్ పాటతో ఒక ఊపు ఊపిన భీమ్స్ సిసిరోలియో, 'స్వాతి రెడ్డి'తో మరోసారి తన సత్తా చాటారు. రాబోయే రోజుల్లో ఈ పాట తెలుగునాట ఒక ఊపు ఊపడం ఖాయం అనేలా బీట్స్‌తో ఉత్సాహభరితమైన సంగీతాన్ని ఈ పాటకు కంపోజ్ చేశారు. అంతేనా.. ఈ పాటను స్వయంగా ఆయనే ఆలపించడం విశేషం. సురేష్ గంగుల సాహిత్యం ప్రేక్షకుల నాడిని పట్టుకున్నట్టుగా ఉంది. అందరూ పాడుకునేలా తేలికైన పదాలతో ఈ పాటకి ఆయన సాహిత్యం అందించారు.మ్యాడ్ స్క్వేర్ను వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్లో వస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న థియేటర్లలో విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: