ఇకపోతే శంకర్ దరకత్వంలో వస్తున్న ఈ మూవీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. గేమ్ ఛేంజర్ ఇప్పటికే గణనీయమైన సంచలనాన్ని సృష్టించింది. ఈ సినిమాలో రామ్ చరణ్ ద్వీపాత్రాభినేయం చేస్తుండడంతో ప్రేక్షకులు మరింత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అందులో చరణ్ క్లాస్ లుక్ లో కనిపించడంతో ప్రేక్షకులందరికీ సినిమా బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ మూవీలోని ఒక మెలోడీ సాంగ్ కోసం ఏకంగా రూ. 20 కోట్లను ఖర్చు చేశారంటూ టాక్ వినిపించిన విషయం తెలిసిందే. అయితే ఆ సాంగ్ కి సంబంధించిన లిరికల్ వీడియో కూడా రిలీజ్ అయింది.
ఇక ఈ సినిమాలో మెగా హీరో రామ్ చరణ్ IAS అధికారిగా చిత్రీకరిస్తున్నట్లు వెల్లడైంది. అతని సున్నితమైన ప్రవర్తన సజావుగా ముడిపడి, మాస్-ఆకర్షణీయమైన అంచుతో మిళితం అవుతుందని తెలుస్తోంది. చమత్కారం యొక్క మరొక పొరను జోడిస్తూ, చరణ్ వృద్ధ పాత్రలో అప్పన్నగా కూడా కనిపిస్తాడు అని సమాచారం. రామ్ చరణ్ నటనకు వావ్ ఫ్యాక్టర్ ఇచ్చేలా ఉంటుందని చర్చలు జరుగుతున్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని మెగా ఫాన్స్ తో పాటు సినీ లవర్స్ కూడా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ గేమ్ చేంజ్ మూవీ ఎలా ఉంటుందో చూడాలి మరి. ఇప్పటికే విడుదల కోసం అన్నీ సిద్ధంగా ఉన్నాయి.