అఫ్ కోర్స్ అల్లు అర్జున్ కూడా బాధపడి ఉంటారు. కానీ అల్లు అర్జున్ ఆ బాధలోనే కృంగిపోకుండా బయటికి వచ్చేసాడు . తన సినిమాలపై కాన్సన్ట్రేషన్ చేశాడు . ఒకపక్క సంధ్యా థియేటర్ తొక్కిసలాటకు సంబంధించిన కేసుల రాద్ధాంతం చూస్తూనే మరొక పక్క కమిట్ అయిన సినిమాలకు న్యాయం చేయాలి అన్న దిశగా ముందుకు వేళ్తున్నారు . రీసెంట్గా పుష్ప2 సినిమాకి సంబంధించిన డబ్బింగ్ స్టార్ట్ చేశాడు అల్లు అర్జున్. అదేంటి సినిమా కూడా రిలీజ్ అయిపోతే ఇప్పుడు డబ్బింగ్ ఏంటి అనుకుంటున్నారా..?
ఆఫ్ కోర్స్ సినిమా రిలీజ్ అయిపోయింది . కానీ సినిమా నిడివి పెరిగిపోవడం వల్ల ఎడిటింగ్ లో కొన్ని సీన్స్ లేపేసారు సుకుమార్ . అయితే వాటి వల్ల కథ కంటిన్యూటీ దెబ్బతింటుంది అన్న కారణంగా మళ్లీ ఆ సీన్స్ ను ఆడ్ చేయబోతున్నారట . జపాన్లో బన్నీ ఇంట్రో ఫైట్ తర్వాత ఆ సన్నివేశం అర్ధాంతరంగా ముగిసిపోతుంది అన్న సంగతి అందరికీ తెలుసు . దానిపై ట్రోలింగ్ కూడా జరిగింది. అయితే ఆ సీన్ కి కంటిన్యూటీ చేయాలి అంటూ సుకుమార్ కొన్ని సీన్స్ యాడ్ చేశారట .
న్యూ ఇయర్ నుంచి ఈ సీన్స్ సినిమాలో కలపబోతున్నారట. ఈ సీన్స్ కి డబ్బింగ్ చెప్పడానికి అన్నపూర్ణ స్టూడియోస్ కి అల్లు అర్జున్ వచ్చాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . తెలుగులో డబ్బింగ్ పూర్తి అయిపోయాక మిగతా భాషల్లో కూడా డబ్బింగ్ పూర్తి చేస్తారట . మొత్తానికి అల్లు అర్జున్ తన కెరియర్ లో జరిగిన ఒక పీడకల నుంచి బయటకు రావడానికి బాగానే ట్రై చేస్తున్నాడు అంటున్నారు బన్నీ అభిమానులు. మరి కొంతమంది అయితే నువ్వు నీలాగే ఉండు బన్నీ..ఎవడు ఏం మాట్లాడినా ప్రాబ్లం లేదు.. అంటూ కూసింత ఘాటుగానే మాట్లాడుతున్నారు..!