ఈ సినిమాలో వింటేజ్ స్టైల్ లో నాగార్జున కనిపించగా నరేశ్, రాజ్ తరుణ్ తమ పాత్రలకు న్యాయం చేశారు. తక్కువ సమయంలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి కలెక్షన్ల విషయంలో అదరగొట్టిందని చెప్పవచ్చు. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ రైడ్ మూవీ రీమేక్ ను మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ తో రవితేజ హీరోగా తెరకెక్కించారు. షాక్, మిరపకాయ్ తర్వాత ఈ కాంబోలో తెరకెక్కిన సినిమా ఇదే కావడం గమనార్హం.
మిస్టర్ బచ్చన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలవడంతో పాటు నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. హాలీవుడ్ మూవీ లైఫ్ యాస్ వీ నోట్ ఇట్ మూవీ స్పూర్తితో తెరకెక్కిన మనమే బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశకు గురి చేసింది. తమిళ మూవీ టెడ్డీ స్పూర్తితో తెరకెక్కిన బడ్డీ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.
రీమేక్ సినిమాలలో మెజారిటీ సినిమాలు నిర్మాతలకు ఊహించని స్థాయిలో నష్టాలను మిగుల్చుతున్నాయి. రాబోయే రోజుల్లో టాలీవుడ్ దర్శకనిర్మాతలు రీమేక్ సినిమాలకు వీలైనంత దూరంగా ఉంటే మంచిదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రీమేక్ సినిమాల వల్ల ఇండస్ట్రీకీ నష్టమే తప్ప లాభం తక్కువని అభిప్రాయాలు వినిపిస్తుండటం గమనార్హం. టాలీవుడ్ దర్శకనిర్మాతల ఆలోచన ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.