ఈ సినిమా కోసం కీర్తి సురేష్ ఎంతగానో కష్టపడింది. రీసెంట్ గానే కీర్తి సురేష్ వివాహం చేసుకుంది. వివాహ అనంతరం అతి తక్కువ సమయంలోనే సినిమాలలో నటిస్తోంది. ఇక పెళ్లయిన మూడు రోజులకే కీర్తి సురేష్ బేబీ జాన్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటుంది. కానీ ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలుస్తోంది.
అలాగే ఈ సినిమాకు పెద్దగా వసూళ్లు రావడం లేదు. కాగా, బేబీ జాన్ సినిమా కోసం ముంబైలో తెగ సందడి చేస్తోంది కీర్తి సురేష్. ఈ క్రమంలోనే గురువారం రాత్రి అక్కడ ఫోటోగ్రాఫర్స్ కీర్తి సురేష్ ఫోటోలు తీయడానికి ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే కొంతమంది ఫోటోగ్రాఫర్స్ ఆమెను కృతి అని పిలవడం జరిగింది. నా పేరు కృతి కాదు కీర్తి అని సరదాగా చెప్పింది. అలాగే మరో ఫోటోగ్రాఫర్ కీర్తి దోశ అని పిలవడంపై కీర్తి సురేష్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
నా పేరు కీర్తి దోశ కాదు కీర్తి సురేష్. నాకు దోశలు అంటే ఇష్టం అని సరదాగా చెబుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక తాజాగా కీర్తి సురేష్ హాట్ ఫొటోస్ షేర్ చేసుకుంది. ఆ ఫోటోలకు బిగ్ నైట్ అంటూ కామెంట్ చేసింది. అయితే ఆ ఫోటోలు చూసిన కీర్తి సురేష్ ఫ్యాన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. మొన్ననే వివాహం చేసుకున్నావు ఫస్ట్ నైట్ చేసుకోవాలి కానీ ఇప్పుడు బిగ్ నైట్ ఏంటి అని నెగిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు.