రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు సంచలన విజయాలు సొంతం చేసుకున్నాయి. వరల్డ్ వైడ్ గా పాపులారిటీ తెచ్చుకున్నాయి. అయితే ఈ రెండు సినిమాలలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ లు చేసిన ఈ సినిమా రికార్డులను క్రియేట్ చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణని సొంతం చేసుకుంది. కాగా ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ఆలియా భట్ తెలుగు సిని పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమాలో ఆలియా సీత పాత్రలో కనిపించింది. కానీ తాను కనిపించింది చాలా తక్కువ సమయం. అయినా ఆ పాత్రకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమాకి ఆలియా పది రోజులు పాటు మాత్రమే షూటింగ్ లో పాల్గొంది. అయితే 10 రోజులకు ఏకంగా ఆలియా భట్ తొమ్మిది కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుందని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి 10 రోజులకు గాను తొమ్మిది కోట్లు తీసుకున్న హీరోయిన్ గా అలియా భట్ నిలిచింది.
సౌత్ ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ కు నిర్మాతలు ఇంత పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. కాగా ఆలియా భట్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తెలుగులో ఇప్పటివరకు ఎలాంటి సినిమా చేయలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమా అవకాశాలతో అలియా భట్ విజయవంతంగా దూసుకుపోతోంది. రీసెంట్ గా అలియా భట్ చేసిన "జిగ్రా" సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆలియా తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.