బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్ట్ లో అదిరిపోయే సెంచరీ సాధించి క్రికెట్ ప్రపంచంలోనే గొప్ప సెన్సేషన్ గా మారాడు నితీష్ కుమార్ రెడ్డి ... ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ లో పుట్టి పెరిగిన నితీష్ రెడ్డి తన ఐదవ సంవత్సరం నుంచే క్రికెట్ ఆడటం మొదలు పెట్టారు కొడుకు క్రికెట్‌ కోసం అతడి తండ్రి తన ఉద్యోగాన్ని కూడా త్యాగం చేశాడు .. అండర్ 12 , అండర్ 14 గ్రూప్ మ్యాచులు సమయంలో మాజీ క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్ నితీష్ రెడ్డి ప్రతిభను గుర్తించి ట్రైనింగ్ కోసం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కు అతను పంపించాడు.


ఇక 2023లో ఐపీఎల్ లో సన్రైజర్స్ హైదరాబాద్ నితీష్ రెడ్డిని కొనుగోలు చేసింది 20 లక్షలు పెట్టి నితీష్ ని కొనుక్కుంది .. ఇక 2024లో ఆ ఫ్రాంచైజికి స్టాంట్ అవుట్‌ పర్ఫామెన్స్ ఇచ్చాడు నితీష్ రెడ్డి .. ఇక అలాగే బంగ్లాదేశ్ తో టి20 లకు ఎంపికైన నితీష్ రెడ్డి ఆ తర్వాత ఆల్రౌండర్ స్థానంలో బోర్డర్ గవాస్కర్ టెస్టర్ లోకి టీమ్ ఇండియా తరఫున అరంగేట్రం ఇచ్చాడు. ఇక నితీష్ కుమార్ రెడ్డి ఫేవరెట్ టాలీవుడ్ హీరో ఎవరు అంటే అతను మరెవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు తాను మహేష్ బాబుకు వీర అభిమానిని నితీష్ చాలాసార్లు చెప్పకొచ్చాడు ..


ఇక తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ అభిమానిని పోకిరి సినిమా నుంచి తాను మహేష్ బాబుని ఇష్టపడుతు నానాని చెప్పుకొచ్చాడు నితీష్ రెడ్డి .. ఇక మహేష్ సినిమాల్లో తనకు ఎంతో స్ఫూర్తినిస్తాయని కూడా నితీష్ రెడ్డి చెబుతూ ఉంటారు.  ఇప్పుడే మెల్‌బోర్న్‌లో హ‌ప్ సెంచరీ చేసిన తర్వాత పుష్ప స్టైల్ లో సెలబ్రేషన్స్ చేస్తే సెంచరీ చేరుకున్నకా  సలార్ స్టైల్ లో భారీ సెలబ్రేషన్స్ చేసి గ్రౌండ్లో వైల్డ్ ఫైర్ పూన‌కాలు తెప్పించాడు నితీష్ రెడ్డి .. ప్రస్తుతం రాబోయే రోజుల్లో ఈ తెలుగు క్రికెటర్ ఇండియన్ క్రికెట్లో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: