గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాను ఓ వీడియో తెగ షేక్‌ చేస్తుంది .. అది పుష్ప2 సాంగ్ మేకింగ్ సంబంధించిన వీడియో.. ఇక అందులో అల్లు అర్జున్ పక్కన పింక్ కలర్ అవుట్ ఫిట్ లో ఓ అమ్మాయి మెస్మరైజింగ్ లుక్స్ తో మెరుపుతీగల డాన్స్ మూమెంట్స్ తో అదరగొడుతుంది .. కిస్సిక్ సాంగ్ మేకింగ్ సందర్భంగా ఐకాన్ స్టార్‌తో  కలిసి ఈ ముద్దుగుమ్మ చేసిన డాన్స్ ప్రాక్టీస్ వీడియో నేటిజెన్లకు తెగ నచ్చేసింది .. ఇక దాంతో ఎవరు ఆ అమ్మాయి ? ఎక్కడి నుంచి వచ్చింది .. ఏం చేస్తుంది అంటూ తెగ వెతికేస్తున్నారు ..


ఇంత‌కి ఆ వీడియోలో అల్లు అర్జున్ పక్కన డాన్స్ చేసిన అమ్మాయి మరెవరో కాదు .. ఆమె పేరు ఊర్వసి అప్సర.. ఈమె పుష్పా 2 సినిమాకి అసిస్టెంట్ డాన్స్ కొరియోగ్రాఫర్గా వర్క్ చేసింది .. థియేటర్లో ప్రేక్షకులకు ఒక ఊపు తెప్పించిన కిస్సిక్ సాంగ్‌కి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ .. అంటే ఈ సాంగ్ డాన్స్ కొరియోగ్రఫి  చేసిన గణేష్ ఆచార్య మాస్టర్ దగ్గర ఈమె అసిస్టెంట్గా వర్క్ చేస్తుంది .. ఈ పాటకే కాదు పుష్ప మొదటి భాగంలో ఊ అంటావా మామ పాట‌కి కూడా ఈమె డాన్స్ కొరియోగ్రాఫర్ గా వర్క్ చేసింది .. అలాగే ఊర్వశి బెల్లీ డాన్స్ లో మంచి ఎక్స్పెక్ట్ .. అంతేకాదు యోగా ట్రైనర్ కూడా .. హీరోయిన్గా నటిగా కూడా ప‌లు సినిమాల్లో ఈమె నటించింది .. 31 డిసెంబర్, కిట్టి పార్టీ, అనంత్’, ‘పింటు కి పప్పి’ వంటి పలు సినిమాల్లో ఈమె నటించింది. అలాగే చాలామంది అగ్ర సెలబ్రిటీలతో ఈమె వర్క్ చేసింది .. సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో కుర్రాకారుకు మెంటల్ తెప్పిస్తుంది ఈ ముద్దుగుమ్మ.


ఇప్పటివరకు మన సౌత్ వాళ్లకు ఈమె గురించి పెద్దగా తెలియదు కానీ అల్లు అర్జున్ తో డాన్స్ ప్రాక్టీస్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం తో ఈమె పేరు ఒక్కసారిగా హైలైట్ అయింది. ఇక ఆమె వీడియో చూసిన కొందరు అసలు ఈమెతోనే ఆ  కిస్సిక్ సాంగ్ చేయిస్తే మరో లెవల్లో ఉంటుంది కదా అనే కామెంట్స్ కూడా చేస్తున్నారు .. ఇలా ఒక మేకింగ్ వీడియో తో ఈమె ఓవర్ నైట్ లోనే స్టార్ అయిపోయింది .. సోషల్ మీడియా యుగంలో ఎప్పుడు ఎవరు ఎలా ఫేమస్ అవుతారు ఎవరికీ తెలియదు ఇదే విడ్డూరం..



మరింత సమాచారం తెలుసుకోండి: