ఆ ఫోటోలో షట్ లేకుండా సిక్స్ ప్యాక్ బాడీతో సాలిడ్ గా కనిపిస్తుంది మరెవరో కాదు టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో సందీప్ కిషన్. తన లేటెస్ట్ మూవీ మజాకా కోసమే సందీప్ కిషన్ ఇంత కష్టపడుతున్నట్టు తెలుస్తుంది. ఆ ఫోటోలు చూస్తున్న అభిమానులు నెటిజన్లు సందీప్ కిషన్ పై ప్రశంశాల వర్షం కురిపిస్తున్నారు .. ఇక తనకు సినిమా పట్ల డెడికేషన్ హార్డ్ వర్క్ కు హాట్సాఫ్ అంటూ ఆ ఫోటోలకు క్రేజీ క్రేజీ కామెంట్లు పెడుతూ వాటిని వైరల్ చేస్తున్నారు. అయితే ఈ సంవత్సరం ఇప్పటికే సందీప్ కిషన్ నటించిన మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి ..
ఊరు పేరు భైరవకోనతో సోలోగా మంచి హిట్ కొట్టిన ఈ యంగ్ హీరో .. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో కలిసి నటించిన కెప్టెన్ మిల్లర్ , రాయన్ సినిమాల్లో కీలక పాత్రలో నటించాడు .. ఇది కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలుగా నిలిచాయి .. అలాగే సందీప్ కిషన్ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి .. ఇప్పుడు తాజాగా మజాకా తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు ఈ క్రేజీ యంగ్ హీరో. రవితేజకు ధమాకా లాంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు త్రినాథరావు నక్కిన తెర్కక్కిస్తున్న మజాకా సినిమాలో రీతు వర్మ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాతో అయినా సందీప్ కిషన్ సాలిడ్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.