పవర్ స్టార్ అయినా డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్నకా అయిన‌ ఎప్పుడు సామాన్య మనిషి లాగా సింపుల్ గానే కనిపిస్తుంటాడు పవన్ కళ్యాణ్ .. ఆడంబరాలు , హంగామాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడానికి అసలు ఒప్పుకోరు. ఉపముఖ్యంమంత్రి అయిన తర్వాత కూడా అదే పద్ధతిని ఆయన ఫాలో అవుతున్నారు పవన్ కళ్యాణ్ సింప్లిసిటీకి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి .. ఇక ఇప్పుడు పవన్ బాటలోనే ఆయన కూతురు ఆద్య కూడా అలాగే నడుస్తుంది.. సింప్లిసిటీలో తండ్రికి తగ్గ కూతురుగా కనిపిస్తుంది..


ఇక ఇందుకు నిదర్శనమే ఈ వీడియో .. ఇక తాజాగా తల్లి రేణూ దేశాయ్ తో కలిసి కాశీ యాత్రకు వెళ్ళింది ఆద్య .. ఇక అక్కడ సింపుల్గా ఆటో రిక్షాలో ప్రయాణించి అందరి దృష్టిని ఆకర్షించింది .. కారులో ప్రయాణించే అవకాశం ఉన్నప్పటికీ తన తల్లితో కలిసి సింపుల్గా ఆటోలో ప్రయాణం చేసింది ఈ స్టార్ కూతురు .. ఇక అందుకు సంబంధించిన వీడియోను రేణు దేశాయ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.. దాంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .. ఇక దాన్ని చూసిన అభిమానులు నెటిజన్లు ఆద్య పై ప్రశంసల  వర్షం కురిపిస్తున్నారు .. సింప్లిసిటీలో తండ్రికి తగ్గ కూతురు అంటూ ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు.


అంతేకాకుండా గతంలో బయట కనిపించిన కొన్ని సందర్భాల్లో కూడా ఎంతో సింపుల్గానే కనిపించింది ఆద్య  . అలాగే ఈ సంవత్సరం స్వతంత్ర వేడుకలు, తిరుమల పర్యటనలు కూడా తండ్రితో కలిసి కనిపించింది ఆద్య .. పవర్ స్టార్ కూతురు డిప్యూటీ సీఎం డాటర్ అన్న దర్పం ఎక్కడ కనిపించదు.. ఇక ఇప్పుడు కూడా కాశి యాత్రలో ఎంతో సింపుల్గా ఆటోలో జర్నీ చేసి వార్తల్లో హైలెట్గా నిలిచింది. అలాగే పవన్ కొడుకు అకిరా నందన్ చిత్ర పరిశ్రమలోకి రాబోతున్నట్టు ఊహ గణాలు వస్తున్నాయి.. పవన్ నటిస్తున్న ఓజి సినిమాలో అకిరా కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడని తెగ ప్రచారం జరుగుతుంది.. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికార ప్రకటన మాత్రం రాలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: