టాలీవుడ్ లో అక్కినేని కుటుంబానికి ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఉన్నది. అక్కినేని కుటుంబానికి కూడా రాజకీయ నాయకులతో మంచి సన్నిహిత సంబంధం ఉన్నది.. ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ కి కూడా మంచి అనుబంధం ఉన్న సంగతి అందరికీ తెలిసింది. కానీ ఏఎన్ఆర్ మాత్రం రాజకీయాల పైన పెద్దగా ఆసక్తి చూపించలేదు. నాగార్జునకి కూడా పొలిటికల్ పరంగా నాయకులతో మంచి బాండింగ్ ఉన్నది. మధ్యలో అక్కినేని కుటుంబం గురించి రాజకీయాలలోకి ఎంట్రీ ఇస్తున్నారని రూమర్స్ వినిపించాయి తప్ప ఇంతవరకు అవి నిజం కాలేదు.


పొలిటికల్ లీడర్స్ తో మాత్రం మంచి స్నేహబంధం ఉన్నది.. అలా అక్కినేని మేనల్లుడు సుమంత్ హీరోగా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ప్రేమ కథ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా పర్వాలేదు  అనిపించుకున్న ఆ తర్వాత సుమంత్ కి సత్యం సినిమాతో భారీ క్రేజ్ ఏర్పడింది. అలా ఎన్నో చిత్రాలను నటించిన సుమంత్.. కానీ నెమ్మదిగా సినిమా అవకాశాలు తగ్గడంతో ఈమధ్య సినిమాలలో హీరోగా నటించడం కంటే కీలకమైన పాత్రలలో నటిస్తూ ఉన్నారు సుమంత్.


పొలిటికల్ పరంగా హీరో సుమంత్ కి మంచి స్నేహితుడుగా ఉన్న రాజకీయ నాయకుడు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. ఆయన ఎవరో కాదు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. వీరిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అట ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే వీరి ఇంట్లో తాతయ్య, మామయ్యకు తెలియకుండా బాల్కనీ కిటికీలో నుంచి సుమంత్ ని పంపించడానికి సహాయం చేసే వారట.


అలా ఒకానొక సమయంలో సుమంత్ ఇంటికి చేరుకునే సరికి రాత్రి అయ్యేదట .అయితే సుమంత్ తన రూమ్ కి చేరుకోవడానికి ముందుగా ఏఎన్నార్ బెడ్ రూమ్ ని సైతం దాటాల్సి ఉన్నదట.. అలా సాధ్యం కాదు కాబట్టి వెనుక వైపున  సుమంత్ తన బెడ్ రూమ్ కి చేరాలి అంటే ఎత్తులో ఉన్నందువలన జగన్ కింద నుండి సపోర్ట్ చేస్తే సుమంత్ తన రూమ్ లోకి వెళ్లేవారట. ఆ తర్వాత జగన్ ఇంటికి వెళ్లేవారని ఒక ఇంటర్వ్యూలో సుమంత్ ఈ విషయాలను వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: