టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఏటా వందలాది సినిమాలు విడుదలవుతుంటాయి. వాటిలో చాలా వరకు సినిమాలు ఫ్లాప్ అవుతాయి. కొన్ని డిజాస్టర్లవుతాయి, మరికొన్ని హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తాయి. 2024లోనూ ఇదే పరిస్థితి రిపీట్ అయింది. ఈసారి సంక్రాంతి నుంచి విడుదలైన సినిమాలతోనే ఫ్లాప్ ల పరంపర మొదలైంది. అగ్ర హీరోల సినిమాలు ఊహించని విధంగా పరాజయం పాలుకావడం ఈ ఏడాది అందరినీ ఆశ్చర్యపరిచింది.

జనవరి 12న విడుదలైన 'గుంటూరు కారం' సినిమా ఊహించి డిజాస్టర్ గా నిలిచింది. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కితే, బాక్సాఫీస్ వద్ద కేవలం 172 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. అయితే, ఈ సినిమా ఫ్లాప్ అని నిర్మాత ఎస్. రాధాకృష్ణ అంగీకరించలేదు. తనకు లాభాలు వచ్చాయని, ఇది సూపర్ హిట్ అని ఆయన వాదించారు. కానీ వాస్తవానికి ఈ సినిమా డిజాస్టర్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరి గత చిత్రం 'అతడు' లాంటి విజయం సాధిస్తుందని భావించారు. కానీ ఈసారి వీరి కలయికలో వచ్చిన సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. అయితే, ఈ సినిమాలోని 'కుర్చీ మడతపెట్టి' పాట మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని విశేషంగా ఆకట్టుకుంది.

విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో 75వ సినిమాగా ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'సైంధవ్' చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ అయ్యింది. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫ్లాప్ కావడంతో వెంకటేష్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ సినిమా 'గుంటూరు కారం' విడుదలైన మరుసటి రోజే, అంటే జనవరి 13న విడుదలైంది. ఈ విధంగా పెద్ద హీరోల సినిమాలు పరాజయం పొందడం సంక్రాంతితోనే మొదలైంది.

 ఇలా మొదలైన ఫ్లాప్‌ల పరంపర ఈ సంవత్సరం అంతా కొనసాగింది. రవితేజ హీరోగా కార్తీక్ గడ్డంనేని దర్శకత్వంలో వచ్చిన 'ఈగల్' అనే యాక్షన్ థ్రిల్లర్ ఫిబ్రవరి 9న విడుదలైంది. ఈ సినిమాలో రవితేజ నటన బాగున్నా కథాంశం ఆకట్టుకోలేకపోవడంతో సినిమా ఫ్లాప్ అయ్యింది. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ల గ్లామర్ కూడా ఈ సినిమాను కాపాడలేకపోయింది.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'మట్కా' సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకోబోతున్నానని చాలా ప్రచారం చేశాడు. కానీ విడుదల తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. సైలెంట్‌గా వచ్చి, సైలెంట్‌గానే వెళ్ళిపోయింది. ఈ సినిమా ఎంత పెద్ద ఫ్లాప్ అంటే, మెగా అభిమానులకు తప్ప బహుశా మరెవరికీ ఈ సినిమా విడుదలైనట్లు కూడా తెలియదు.

మాస్ యాక్షన్ హీరో ఈ ఏడాది 'భీమా', 'విశ్వం' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు సినిమాలు కూడా అతనికి డిజాస్టర్లను మిగిల్చాయి.

'అర్జున్ రెడ్డి'తో ఒక్క రాత్రిలో స్టార్ హీరోగా మారిన విజయ్ దేవరకొండకు కూడా ఈ సంవత్సరం నిరాశ తప్పలేదు. అతని 'ది ఫ్యామిలీ స్టార్' మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. అంతేకాదు, ఈ సినిమా విపరీతమైన ట్రోలింగ్‌కు గురైంది. 'గీత గోవిందం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన పరశురామ్ ఈసారి విజయ్‌ను పూర్తిగా నిరాశపరిచాడు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించడం వల్ల సినిమా బాగుంటుందని అందరూ అనుకున్నారు, కానీ అందరి అంచనాలు తలకిందులయ్యాయి.

బయట చాలా హడావిడి చేసే విశ్వక్ సేన్ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ సంవత్సరం పూర్తిగా చేతులెత్తేశాడు. ఈ సంవత్సరం 'గామి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా కూడా అతనికి విజయాన్ని అందించలేకపోయింది. ఇక అతను నటించిన మిగతా రెండు సినిమాలు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి', 'మెకానిక్ రాకీ' కూడా కనీసం యావరేజ్‌గా కూడా నిలబడలేకపోవడం బాధాకరం.

అల్లరి నరేష్ 'మూర్ఖత్వం' అనే కాన్సెప్ట్‌తో 'బచ్చల మల్లి' మూవీ తీశాడు. ఈ సినిమాని అట్టర్ ఫ్లాప్ అయింది. సుధీర్ బాబు, శ్రీ విష్ణు, రాజ్ తరుణ్, రామ్ పోతినేని, కార్తికేయ, శర్వానంద్, ప్రియదర్శి వంటి నటులు నటించిన సినిమాలు కూడా ఈ సంవత్సరం క్లియర్ ఫ్లాప్స్ కావడం టాలీవుడ్‌కు ఊహించని పరిణామం అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: