ఏది ఏం జరిగినా కూడా ఇప్పుడు పుష్ప2 సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.. మొదటి భాగం కంటే రెండో భాగం సినిమా కంటే కాంట్రవర్సీలు పరంగా బాగా హైలైట్ అయింది. పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ సినిమా గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకునే పరిస్థితి క్రియేట్ అయింది. అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం ఒక సెన్సేషన్ అయితే ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు కూడా మరో సెన్సేషన్ .. ఒక్క స్టార్ హీరో గురించి ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడటం ఒక సంచలనం అనే చెప్పాలి .. ఇక ఈ సినిమా గురించి అల్లు అర్జున్ కు అలాగే సుకుమార్ కు మధ్య రీసెంట్గా గొడవ జరిగిందని ఒక న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. అల్లు అర్జున్ అరెస్టు చేసిన తర్వాత సుకుమార్ పెద్దగా రియాక్ట్ కాలేదు ..


అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి వచ్చాడు అంతే ఆ తర్వాత రామ్ చరణ్ సినిమా కోసం ప్రమోషన్స్ చేసే పనిలోపడ్డాడు సుకుమార్.. అయితే ఇప్పుడు ఇది అల్లు అర్జున్ కు నచ్చలేదని సుకుమార్‌తో గొడవ అయిందని .. దాదాపు నాలుగు సంవత్సరాలు పాటు కలిసి పనిచేశామని  నేను కష్టాల్లో ఉన్న సమయంలో నువ్వు ఇలా బిహేవ్ చేయడం ఏమాత్రం నాకు నచ్చలేదంటూ అల్లు అర్జున్ , సుకుమార్ పై సీరియస్ అయినట్టు వార్తలు వస్తున్నాయి.. గేమ్ ఛేంజ‌ర్ సినిమా ప్రమోషన్స్ కోసం అమెరికా వెళ్ళిన సుకుమార్ అక్కడ కొన్ని కామెంట్స్ కూడా చేశారు. తనకు ఏ హీరోతోనో ఎక్కువ మంచి రిలేషన్ లేదని కానీ రంగస్థలం సినిమా తర్వాత రామ్ చరణ్‌తో ఎక్కువ రిలేషన్ క్రియేట్ అయిందని .. ఇప్పుడు మళ్లీ రామ్ చరణ్‌తో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నట్లు కామెంట్ చేశాడు. ఈ కామెంట్స్ అల్లు అర్జున్ అభిమానులకు కూడా అసలు నచ్చలేదు .


 అల్లు అర్జున్ తో నాలుగు సినిమాలు చేసిన సుకుమార్ ఇలా మాట్లాడతాడని కూడా ఎవరు ఊహించలేదు. ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని సుకుమార్ భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకే కాస్త జాగ్రత్తలు పడుతున్నట్టు కనిపిస్తుంది. మెగా ఫ్యామిలీని దూరం చేసుకుని అల్లు అర్జున్ ఇబ్బందులు పడటంతో అనవసరంగా అల్లు అర్జున్ వెంట వెళ్లి తాను కూడా ఇబ్బందులు పడటం ఎందుకు అనే ఒపీనియన్ లో కూడా సుకుమార్ ఉన్నట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ విషయంగా పెద్దగా రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయలేదు సోషల్ మీడియాలో కూడా అల్లు అర్జున్ కు మద్దతుగా పోస్టులు కూడా పెట్టలేదు సుకుమార్.. ఇక గేమ్ ఛేంజర్‌ సినిమా ఈవెంట్లో కూడా దీనికి సంబంధించి ఎలాంటి కామెంట్లు సుకుమార్ చేయలేదు.. ప్రస్తుతం రామ్ చరణ్ సినిమా కోసం కథ రెడీ చేసే పనిలో ఉన్నాడు .. ఈ సినిమాను వచ్చే సంవత్సరం ఆగస్టు నుంచి షూటింగ్ మొదలుపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: