- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


అక్కినేని వారసుడు నాగచైతన్య కెరీర్ గత కొంతకాలంగా పడుతూ లేస్తూ వస్తోంది. నాగ‌చైత‌న్య గ‌త కొంత కాలంగా చేస్తోన్న సినిమా లు అంత గా స‌క్సెస్ కావ‌డం లేదు. ఆ మాట‌కు వ‌స్తే అక్కినేని ఫ్యామిలీ లో ఎవ‌రు చేసిన సినిమా లు అయినా కూడా హిట్ కావ‌డం లేదు. ప్రస్తుతం చైతు గీతా ఆర్ట్స్‌ బ్యానర్లో నాగచైతన్య తండెల్ సినిమాలో నటిస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా నాగచైతన్య కెరీర్ లోనే భారీ బ‌డ్జెట్ తో తెరకెక్కుతోంది. వాస్తవానికి ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే డిసెంబర్ లో పుష్ప 2 సినిమా ఉండడంతో పాటు . . . సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు ఉండడంతో తండేల్‌ సినిమా ను ఫిబ్రవరి లేదా మార్చి లో రిలీజ్ చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి . నాగచైతన్య సినిమా కెరియర్ ఎలా ఉన్నా అతడి కెరీర్లో ఏడాది మ‌ర‌పురాని సంఘటన జరిగింది.


స్టార్ హీరోయి న్ సమంత తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుని .. నాలుగేళ్ల కాపురం తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చేసిన నాగచైతన్య తాజాగా మరో హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల తో ప్రేమలో పడ్డాడు. గత రెండు మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న ఈ ఇద్దరు ఎట్టకేల‌కు పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. ఏది ఏమైనా నాగచైతన్య జీవితంలో కి రెండో భార్యగా కూడా మరో హీరోయిన్ రావటం విశేషం. విచిత్రం ఏంటంటే శోభిత తెలుగు అమ్మాయి . . ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి ఆమె స్వగ్రామం అన్న సంగతి తెలిసిందే. ఇక శోభిత - చైతు దంపతులు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ముంబైలో పర్సనల్గా చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: