దివంగత నటి సిల్క్ స్మిత ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తన నటన, అందంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ బ్యూటీ ఎలాంటి సినిమాలో నటించిన ఆ సినిమాలు అన్ని సూపర్ హిట్ అయ్యేవి. తన కెరీర్ లో 300కి పైగా సినిమాలలో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. సిల్క్ స్మిత అంటే ప్రతి ఒక్కరికి ఎంతగానో ఇష్టం. సిల్క్ స్మిత ఎన్నో ఆర్థిక ఇబ్బందులతో సినీ ఇండస్ట్రీలోకి వచ్చింది. కానీ సినీ ఇండస్ట్రీలో సక్సెస్, ఎంతో డబ్బు, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. కానీ తాను మరణించే చివరి క్షణంలో ఎంతో నరకాన్ని అనుభవించింది. 


సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి. అతి చిన్న వయసులోనే తన కుటుంబంలో ఆర్థిక సమస్యలతో ఎన్నో ఇబ్బందులు పడింది. చదువు మీద ఎంతో ఇష్టం ఉన్నప్పటికీ ఆర్థిక సమస్యల కారణంగా తన చదువును మానేసింది. 14 ఏళ్ల వయసులోనే సిల్క్ స్మితకు తన కుటుంబ సభ్యుల వివాహం చేశారు. దాంతో తన జీవితం అంధకారంగా మారిపోయింది. తన అత్తింటి వేధింపులు, భర్త టార్చర్ ఎప్పుడూ ఉండేది. వారి టార్చర్ భరించలేక సిల్క్ స్మిత ఇంట్లో నుంచి పారిపోయి డబ్బు సంపాదించడం కోసం సినీ ప్రపంచాన్ని ఎంచుకుంది.


ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకుంది. కానీ తన కెరీర్ విషాదంలో మునిగిపోయింది. తన చావుకు ఎంతోమంది కారణమంటూ గతంలో ఎంతో మంది పేర్లు వినిపించాయి. అందులో స్టార్ హీరో రజనీకాంత్ పేరు కూడా వెలుగులోకి వచ్చింది. సిల్క్ స్మిత మరణానికి రజనీకాంత్ కారణం అంటూ అనేక రకాల వార్తలు వచ్చాయి. వీరిద్దరి మధ్య గతంలో ప్రేమాయణం నడిచిందట. ఆ సమయంలో రజినీకాంత్ కూడా సిల్క్ స్మిత లేకపోతే సినిమాలలో నటించేవాడే కాదట. ఏమైందో తెలియదు వీరిద్దరి రిలేషన్ మధ్యలోనే ఆగిపోయింది.


కాగా సిల్క్ స్మిత ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో అవకాశాలు ఇస్తారని ఓ నిర్మాత వెంటపడ్డాడట. అప్పటికే సిల్క్ స్మిత సినిమాలు ద్వారా కొంత డబ్బు, ఆస్తులను కూడా దాచుకుందట. అయితే ఆ నిర్మాత... సిల్క్ స్మితను మోసం చేసి తన వద్ద ఉన్న ఆస్తులన్నీ తన పేరుపై రాయించుకున్నాడట. అవకాశాలు ఇస్తానంటూ మోసం చేశాడట. కానీ చివరకు ఎలాంటి సినిమా అవకాశాలు ఇవ్వకుండా సిల్క్ స్మితను మోసం చేశాడట. ఈ వార్త అప్పట్లో ఇండస్ట్రీ వర్గాల్లో తెగ హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: