టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన కుటుంబాలలో మెగా కుటుంబం ఒకటి. మెగా కుటుంబం హీరోలతో సినిమాలను తెరకెక్కించిన దర్శకులు ఎంతో మంది ఉన్నారు. కానీ ఈ కుటుంబానికి ఓ దర్శకుడు మాత్రం పెద్దగా కలిసి రాలేదు. ఈ కుటుంబం హీరోలతో ఆ దర్శకుడు చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఆ దర్శకుడు ఎవరు ..? ఆ సినిమాలేమిటి అనే వివరాలను తెలుసుకుందాం.

మెగా ఫ్యామిలీకి పెద్దగా కలిసి రాని దర్శకులలో శ్రీను వైట్ల ఒకరు. ఈయన మొదటిగా మెగాస్టార్ చిరంజీవి హీరో గా రూపొందిన అందరివాడు అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో చిరంజీవి రెండు పాత్రలలో నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమా తర్వాత చాలా సంవత్సరాలకు శ్రీను వైట్ల , చిరంజీవి కుమారుడు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా బ్రూస్ లీ అనే సినిమాను రూపొందించాడు. ఈ సినిమాలో ఓ చిన్న పాత్రలో చిరంజీవి కూడా నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు.

ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి సోదరుడు అయినటువంటి నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ హీరో గా రూపొందిన మిస్టర్ అనే సినిమాకు కూడా శ్రీను వైట్ల దర్శకత్వం వహించాడు. పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా కూడా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరోలు అయినటువంటి చిరంజీవి , రామ్ చరణ్ , వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందిన మూడు సినిమాలకు శ్రీను వైట్ల దర్శకత్వం వహించగా ఆ మూడు సినిమాలు కూడా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: