ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియా చిత్రం దేవర. డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాని తెరకెక్కించారు.ఈ సినిమా సూపర్ హిట్ టాక్ అని సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద భారి కలెక్షన్స్ ని రాబట్టింది. అయితే విడుదలైన ప్రతిచోట నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ కూడా కలెక్షన్స్ మాత్రం బాగానే రాబట్టింది. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టినట్లు పలువురు ట్రెండ్ నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ నటన ,యాక్షన్స్ సన్నివేశాలు పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.


దేవర సినిమా విజయం కావడంతో అభిమానులు కూడా ఫుల్ ఖుషి తో ఉన్నారు. ముఖ్యంగా దేవర డిజిటల్ రైట్స్ ని కూడా నెట్ ఫ్లిక్స్ భారీ ధరకే కొనుగోలు చేసింది. అయితే ఓటీటి లో కూడా దేవర సినిమా దండయాత్ర చేశారని విధంగా తెలుస్తోంది. ఓటిటిలో ట్రెండింగ్లో నిలిచిన చిత్రాలలో దేవర సినిమా కూడా నిలిచిందట. నాన్ ఇంగ్లీష్ టాప్ -10  చిత్రాలలో నాలుగవ స్థానంలో గ్లోబల్ స్థాయిలో దేవర సినిమా నిలిచినట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా దేవర-2 పైన అంచనాలు పెరిగిపోతున్నాయి.



చిత్ర బృందం కూడా స్క్రిప్ట్ పనులు కూడా మొదలుపెట్టినట్లు సమాచారం. దేవర చిత్రానికి గ్లోబల్ స్థాయిలో ఆడియన్స్ బాగా కనెక్ట్ అవ్వడంతో ఈ సినిమా రేంజ్ ఏంటో అర్థం అయింది అంటూ అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటించడంతో పాటు జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించడం ఈ సినిమాకి ప్లస్ అయ్యింది. మరి డైరెక్టర్ కొరటాల శివ దేవర సినిమాకి మించి రెండవ భాగాన్ని తెరకెక్కిస్తారేమో చూడాలి మరి. మ్యూజిక్ పరంగా కూడా అందరిని ఆకట్టుకున్న దేవర సినిమా రెండో భాగానికి అంతకుమించి అనిరుద్ అందిస్తారేమో చూడాలి. మొత్తానికి ఎన్టీఆర్కు దేవర సినిమా ప్లస్సు గానీ మిగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: