ప్రస్తుతం కూలి సినిమాలో నటిస్తున్న శృతిహాసన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.. తనకు దేవుడిపైన నమ్మకం ఉన్నప్పటికీ తన తండ్రి కారణంగానే ఆమె గుడికి వెళ్లలేకపోయేదాన్ని అంటూ తెలిపింది. తన తండ్రి ఇంట్లో ఉండే వారిని దేవాలయాలకు వెళ్ళనిచ్చేవారు కాదంటూ తెలిసింది శృతిహాసన్. తాను మాత్రం చర్చికి వెళ్లేదాన్ని అని ఈ విషయం తన తండ్రికి కూడా చాలా ఏళ్ల తర్వాత తెలిసింది అంటూ తెలిపింది.
ప్రస్తుతం తాను ఈ స్థాయిలో ఉన్నానంటే అది దేవుడు మీద ఉండే నమ్మకమే అంటూ వెల్లడించిన శృతిహాసన్ తనకు 18 ఏళ్లు ఉన్నప్పుడే తన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారని ఇది తనను చాలా డిప్రెషన్ కి గురయ్యేలా చేసిందని.. ఈ సంఘటన వల్ల తాను పూర్తిగా మద్యానికి బానిసయ్యానని వెల్లడించింది.. అయితే తన ఆరోగ్యం చాలా క్షీణించింది అనే వార్తలు వినిపించాయి. అందులో మాత్రం నిజం లేదని.. తన తల్లిదండ్రులు విడాకులు తన మనసుకు చాలా బాధ కలిగించిందని తెలియజేసింది. తల్లిదండ్రుల విడాకుల వల్లే తను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని కూడా వెల్లడించింది శృతిహాసన్.