తెలుగు సినీ పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ కి రావడం వెనుక చాలామంది సినీ సెలబ్రిటీల హస్తం ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఏఎన్నార్ వంటి వారి కృషి కూడా చాలానే ఉన్నది. 2024లో తన శత జయంతిని కూడా ఇటీవల పూర్తి చేసుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమకి అమూల్యమైన సేవలు అందించారంటూ తాజాగా నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఏఎన్ఆర్ పేరు ప్రస్తావించడం జరిగింది. ఏఎన్ఆర్ వంటి వారి కృషితోనే తెలుగు సినిమాకు కొత్త శిఖరాలు తీసుకువెళ్లాయని తెలియజేశారు.


ముఖ్యంగా ఏఎన్నార్ చిత్రాలలో భారతీయ సంస్కృతి, విలువలు, వ్యవస్థలు, వారసత్వం ఇలా చాలా ఎన్నో ప్రేరేపించారని చెప్పవచ్చు.. ఏఎన్ఆర్ తన ఏడు దశాబ్దాల కెరియర్లో తెలుగు సినిమా అభివృద్ధి విజయంలో చాలా కీలకమైన పాత్ర పోషించారు. అంతేకాకుండా ఏఎన్ఆర్ అన్నపూర్ణ స్టూడియో నిర్మాణం ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీని మరొక స్థాయికి తీసుకువెళ్లారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ ఎన్నో చిత్రాల షూటింగులు ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. అందుకే ఏఎన్ఆర్ భారతీయ సినిమాకు చేసినటువంటి ఈ అపారమైన కృషికి గాను.. పద్మ విభూషణ్, దాదాసాహె పాల్కే, పద్మశ్రీ , పద్మభూషణ్ వంటి అవార్డులను ఇచ్చారు.


అయితే ఈ ఏడాది ఇండియన్ ప్రభుత్వం అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలను కూడా ప్రత్యేకంగా పురస్కరించుకొని ఒక స్టాంపును కూడా విడుదల చేసిందట.. ఇది గోవాలోని IFFI ప్రత్యేకంగా నివాళులు అర్పిస్తూ ఏఎన్ఆర్ క్లాసికల్ చిత్రాలను అక్కడ ప్రదర్శించడం జరిగింది. అక్కడికి ఏఎన్ఆర్ కుటుంబం కూడా వెళ్లి ఒక గ్రాండ్ ఈవెంట్ ని కూడా నిర్వహించారు.ఈ వేడుకలలో సైతం అమితాబచ్చన్, చిరంజీవి వంటి దిగ్గజ హీరోలను  ఏఎన్ఆర్ జాతియ అవార్డుతో సత్కరించడం జరిగింది. మొత్తానికి నరేంద్ర మోడీ నోట ఏఎన్నార్ మాట రావడంతో ఏఎన్నార్ అభిమానులు కూడా కాస్త ఆనందాన్ని తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: