రామ్ చరణ్ ఈ సినిమాతో శంకర్ రేంజ్ ను పెంచేస్తారని కామెంట్లు వినిపిస్తున్నాయి. గేమ్ ఛేంజర్ ట్రైలర్ కోసం సినీ అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గేమ్ ఛేంజర్ ట్రైలర్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని రామ్ చరణ్ ఈ సినిమాలో మూడు గెటప్స్ లో కనిపిస్తారని తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఈ సినిమాకు మెయిన్ హైలెట్ కానుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
గేమ్ ఛేంజర్ సినిమా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. కియారా అద్వానీకి సైతం ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకమనే సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ మూవీ బాక్సాఫీస్ రిజల్ట్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది. గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నారు. ఇంటర్వెల్ ఈ సినిమాకు హైలెట్ కానుందని తెలుస్తోంది.
గేమ్ ఛేంజర్ సినిమాకు నిర్మాతలు రికార్డ్ స్థాయిలో ఖర్చు చేశారు. నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో గతంలో ఏ సినిమాకు ఖర్చు కాని స్థాయిలో ఖర్చు చేశారు. ఇండియన్ సినీ చరిత్రలో గేమ్ ఛేంజర్ మూవీ హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కింది. గేమ్ ఛేంజర్ సినిమాలో అప్పన్న పాత్రలో రామ్ చరణ్ కనిపించనున్నారు. గేమ్ ఛేంజర్ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమా ప్రమోషన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు.