అయితే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 ముగియడంతో వీరిద్దరి లవ్ స్టోరీకి కూడా బ్రేక్ పడుతుందని అభిమానులు అనుకున్నారు. కానీ సోషల్ మీడియాలో విష్ణు ప్రియ, పృథ్వీరాజ్ శెట్టి ఫ్యాన్ పేజీ ఒకటి వారిద్దరి వీడియోను ఎడిట్ చేసి పోస్ట్ చేయగా.. దానికి విష్ణు ప్రియ వావ్ ఈ ఎడిట్ ఎంత బాగుందని కామెంట్ చేయడం జరిగింది. అలాగే ఆ ఎడిట్ ని తన స్టోరీలో కూడా పెట్టుకుంది. ఈ ఎడిట్ చాలా బాగుందని, ఒకవేళ బిగ్ బాస్ సీజన్ 8 అనేది సినిమా అయితే.. అందులో నేను హీరోయిన్ లాగా ఫీల్ అయ్యేలా మీ ఏడిట్స్ చేస్తున్నాయని ఆమె రాసుకొచ్చింది. అంతే కాదు ఆమె ఆ ఎడిట్ ని హైలైట్ లో కూడా యాడ్ చేసుకుంది. ఓ పక్క పృథ్వీ, ఈమెను దూరం పెడుతున్నా.. విష్ణు ప్రియ మాత్రం పృథ్వీ వెంటపడుతూనే ఉంది.
ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో విష్ణు ప్రియ మాట్లాడుతూ.. 'నా బిగ్ బాస్ జర్నీ అంత బ్యూటిఫుల్‌గా వచ్చిందంటే పృథ్వీ వల్లే. బయటకు వచ్చిన తరువాత మా గురించి వస్తున్న రీల్స్ చూస్తుంటే వావ్ అనిపిస్తుంది. నేను మంచి పని చేశాననే అనిపిస్తుంది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత.. పృథ్వీని కలవాలనిపించింది కానీ.. కుదర్లేదు. అతను బెంగుళూరులో ఉంటున్నాడు, నేను హైదరాబాద్‌లో ఉంటున్నా. ఫినాలే రోజు కలిశాం అంతే. పృథ్వీని కలవాలని.. అతనితో కలిసి వర్క్ చేయాలని చాలా ఉంది' అంటూ విష్ణు ప్రియ చెప్పుకొచ్చింది. ఇది చూసిన ఫాన్స్ వీరిద్దరూ కలవాలని కామెంట్స్ పెడుతున్నారు.