టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన హీరోలలో నితిన్ ఒకరు. ఈయన జయం అనే మూవీ తో కెరీర్ను మొదలు పెట్టి మొదటి మూవీతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత కూడా ఈయన చాలా సినిమాలతో మంచి సక్సెస్ లను అందుకున్నాడు. ఇక కొన్ని సంవత్సరాల పాటు వరుస అపజయాలతో డిలా పడిపోయిన ఈయన ఇష్క్ అనే మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకొని మళ్ళీ లైన్లోకి వచ్చాడు.

ఇష్క్ మూవీ తర్వాత చాలా కాలం పాటు మంచి స్థాయిలో కెరీర్ను కొనసాగించిన నితిన్ కి ఈ మధ్య కాలంలో మళ్ళీ వరుస పెట్టి అపజయాలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఈయన నటించిన చాలా సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. నితిన్ ప్రస్తుతం రాబిన్ హుడ్ , తమ్ముడు అనే సినిమాల్లో నటిస్తున్నాడు. ఇకపోతే తమ్ముడు సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి కొన్ని పోస్టర్స్ ను విడుదల చేయగా అది ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో  ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

దానితో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక ఈ సినిమాకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ తమ్ముడు అనే టైటిల్ ను పెట్టుకోవడంతో ఈ మూవీ కచ్చితంగా విజయం సాధిస్తుంది అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి మంచి అంచనాల కలిగి ఉన్న ఈ సినిమా వచ్చే సంవత్సరం మంచి విజయాల లిస్టులో చేరుతుందో లేదో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: