- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .


టాలీవుడ్ లో ఉన్న టాప్ మోస్ట్ స్టార్ హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు. ఎలాంటి పాన్ ఇండియా సినిమా చేయకుండానే .. పాన్ ఇండియా సినిమాలు ఊపందు కోని సమయంలో ఇంటర్నేషనల్ హీరోల లెవెల్ చరిష్మా సాలిడ్ యాక్షన్ కటౌట్ హీరోగా మహేష్ పేరు తెచ్చుకున్నాడు. లేటెస్ట్ గా దిగజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి త్రిబుల్ ఆర్ డాక్యుమెంటరీ చూసి చాలా మంది మహేష్ విషయంలో సింపుల్ గా కామెంట్ చేస్తూ ఉండటం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్ గా మారింది. రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమా కోసం రామ్ చరణ్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక రేంజ్ లో కష్టపడ్డారని .. ఇప్పుడు మహేష్ .. రాజమౌళి కోసం ఆ రేంజ్ లో డెడికేషన్ చూపిస్తారా అంటూ చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.


అలా కామెంట్ చేసేవారు డెఫినెట్గా మహేష్ బాబు గురించి కొన్ని విషయాలు తెలుసుకోవలసిన అవసరం ఉంది. మహేష్ బాబు సున్నితంగా ఉంటారు ఆ తరహా క‌థలే ఎంచుకుంటారు .. అయితే టకరిదొంగ - 1 నేనొక్కడినే సినిమా కోసం ఎలాంటి డేడికేషన్ చూపించారో ? చిన్న వయసులోనే ఎన్నో ప్రాణాంతక సాహసాలు ఎలాంటి డూప్స్‌ లేకుండా చేశారు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఇలా ఉంటే మహేష్ ... రాజమౌళి సినిమా కోసం ఒక రేంజ్ లో కష్టపడితే కానీ పని అవ్వదు అని చాలామంది చెబుతున్నారు. ఈ విష‌యం లోనే కొంద‌రికి మ‌హేష్ విష‌యంలో సందేహాలు ఉన్నాయి.


ఇక ట‌క్క‌రిదొంగ టైంలో ... అప్పట్లోనే ఇంటెర్నేషనల్ లెవెల్లో డెడికేషన్ ని తాను చూపించారు. ఈ లెక్కన తనకి తగ్గ సరైన సినిమా పడితే తాను ఎక్కడివరకు అయినా వెళ్తాడు అన‌డంలో సందేహం లేదు. ఇక రాజమౌళి లాంటి దర్శకునితో అందులోని గ్లోబల్ లెవెల్లో సినిమాకి అంటే డెఫినెట్ గా తన ఎఫర్ట్స్ ఎలా ఉంటాయో ?  చెప్ప‌క్క‌ర్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: